Site icon NTV Telugu

Sarath Babu : పెదనాన్న ఆరోగ్యం నిలకడగానే వుంది.. పుకార్లు నమ్మవద్దు..

Sharth Babu

Sharth Babu

టాలీవుడ్ సీనియర్ యాక్టర్ శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రి డాక్టర్లు ప్రకటించారు. 71 సంవత్సరాల శరత్ బాబుకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ( ఐసీయూ)లో ప్రత్యేక డాక్టర్ల బృందం చికిత్స అందిస్తోందని, వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఆయన త్వరగా కోలుకుంటారని ఏఐజీ ఆస్పత్రి ఆశాభావం వ్యక్తం చేసింది.

Also Read : Ugram: ‘అల్లరి’ నరేశ్ కు అచ్చొచ్చిన నెలలోనే ‘ఉగ్రం’!

కొన్ని రోజుల క్రితం అనారోగ్యానికి గురైన ప్రముఖ నటుడు శరత్ బాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన సోదరుడి కుమారుడు ఆయుష్ తేజస్ స్పందించారు. మా పెదనాన్న శరత్ బాబు ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. గతంలో కంటే ఇప్పుడు కొంచెం కోలుకున్నారని ఆయుష్ చెప్పుకొచ్చారు. అయితే, ఆయన పూర్తిగా కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుందని డాక్టర్లు చెప్పినట్లు వెల్లడించారు.

Also Read : Hyderabad Crime: అప్పు ఇచ్చి అడినందుకు దారుణం.. హైకోర్టు ముందే హత్య

సోషల్ మీడియాలో ఆయన చనిపోయారంటూ వచ్చే వార్తలను నమ్మొద్దని అభిమానులకు శరత్ బాబు సోదరుడి కొడుకు ఆయుష్ తెలిపాడు. శరత్ బాబు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న వారికి కృతజ్ఞతలు చెప్పారు. అయితే బుధవారం రాత్రి శరత్‌బాబు చనిపోయారంటూ కొన్ని వెబ్‌సైట్లలో వార్తలు వచ్చాయి. దీంతో కొందరు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతూ తమ సోషల్‌ మీడియా అకౌంట్లో పోస్ట్‌లు పెట్టి తర్వాత వాటిని డిలీట్ చేశారు. ఈ విషయంపై శరత్ బాబు సోదరి రియాక్ట్ అయ్యారు. ఆయన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చారు.. త్వరలోనే కోలుకుని మీడియాతో మాట్లాడతారని ఆమె అన్నారు. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలు రాయొద్దని శరత్ బాబు కుంటుంబ సభ్యులు కోరారు.

Exit mobile version