Ugram: ‘అల్లరి’ నరేశ్ కు అచ్చొచ్చిన నెలలోనే ‘ఉగ్రం’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allari Naresh: కొందరు హీరోలకు కొన్ని సీజన్స్ బాగా కలిసి వస్తాయి. అలానే మరి కొందరు హీరోలకు కొన్ని మాసాలు బాగా అచ్చి వస్తాయి. అలా ‘అల్లరి’ నరేశ్ కు మే ప్రథమార్ధం బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే… నరేశ్ మొదటి సినిమా ‘అల్లరి’ మే 10వ తేదీ 2002లో విడుదలై అతని ఇంటి పేరుగా మారిపోయింది. నరేశ్ తండ్రి ఇవీవీ సత్యనారాయణ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘కితకితలు’ సినిమా సైతం నరేశ్ కు చక్కని విజయాన్ని అందించింది. ఈ మూవీ 2006 మే 5న జనం ముందుకు వచ్చింది. ‘అల్లరి’ నరేశ్ కు మ్యూజికల్ బ్లాక్ బస్టర్ మూవీ ‘సీమటపాకాయ్’. పూర్ణ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా నరేశ్ కెరీర్ లో అప్పటి వరకూ బిగ్గెస్ట్ హిట్! ఈ సినిమా 2011 మే 13న విడుదలైంది. ఈ సినిమాలన్నింటీలో నరేశ్ సోలో హీరోగా నటించాడు.
‘అల్లరి’ నరేశ్ కెరీర్ ను మరో మలుపు తిప్పిన సినిమా ‘మహర్షి’. మహేశ్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాలో నరేశ్ అతని స్నేహితుడిగా ఓ కీలక పాత్రను పోషించాడు. ఈ మూవీ సక్సెస్ లో నరేశ్ క్యారెక్టర్ కూడా ప్రధాన భూమిక పోషించిందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఈ సినిమా 2019 మే 9న విడుదలైంది. ఇలా నరేశ్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమాలన్నీ మే నెలలోనే వచ్చాయి. ఇప్పుడు అదే నెల 5న ‘ఉగ్రం’ వస్తోంది. సో… బాగా అచ్చివచ్చిన మే నెల ‘ఉగ్రం’కూ కలిసి వస్తుందేమో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
-
Xiaomi 18 Fold: షియోమి 18 ఫోల్డ్.. 6,000mAh బ్యాటరీ.. 7.6 ఇంచెస్ డిస్ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్
-
Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!