Viral News : సమోసాను ఇష్టపడని వారు ఉండరు. సమోసాను చాలా మంది వేడి వేడిగా తినడానికి ఇష్టపడుతారు. కానీ అలా సమోసా తినగానే నోటి నుంచి రక్తం ధారగా కారితే అవును, అలాంటి ఉదంతం బీహార్‌లోని ఛప్రా నుండి వెలుగులోకి వచ్చింది. సమోసా తిన్న యువకుడికి నోటి నుండి రక్తం వచ్చింది. ఆ యువకుడి నోటినిండా రక్తం కారడానికి కారణమైన సమోసాలో ఏముందో తెలుసుకుందాం. సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. దీన్ని షేర్ చేసుకుంటూ.. హైవే పక్కనే ఉన్న రెస్టారెంట్ నుంచి సమోసా కొన్నానని ఓ యువకుడు చెప్పాడు. సమోసా ముక్క తినగానే నోటి నుంచి రక్తం రావడం మొదలైంది. యువకుడు వెంటనే సమోసా ముక్కను ఉమ్మివేశాడు. దాంట్లో ఉంది చూసి ఆశ్చర్యపోయాడు. బంగాళదుంపలతో పాటు లోపల చిన్న ఇనుప తీగ కూడా కనిపించింది. ఈ తీగ కారణంగా అతని నోరు తెగిపోయి లోపల నుంచి రక్తం రావడం మొదలైంది. వెంటనే దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
Read Also:Muchumarri Girl Incident: ముచ్చుమర్రి బాలిక కేసులో ట్విస్ట్..! ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి..
అలాగే యువకుడు వెంటనే ఈ విషయాన్ని హోటల్ యజమానికి తెలియజేశాడు. దీంతో హోటల్ యాజమాన్యం ఆయనకు క్షమాపణలు చెప్పింది. బహుశా ఇది పొరపాటున జరిగి ఉండవచ్చు. దయచేసి మమ్మల్ని క్షమించండి. తారయ్య రాంబాగ్ ఎస్‌హెచ్ 73లో ఉన్న గోలు హోటల్ నుంచి తాను ఈ సమోసాను కొన్నానని యువకుడు చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, చాలా మంది వినియోగదారులు దానిపై కామెంట్ చేయడం ప్రారంభించారు. ఈ హోటలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. గోలు హోటల్ చాలా ఫేమస్ అయినప్పటికీ ఇక్కడి ఫుడ్ పై చాలా సార్లు ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయి. మరో వినియోగదారు సమోసా ధర ఐదు రూపాయలు.. చాలా ఫిర్యాదులు అని రాశారు. ఈ కారణంగా రోడ్డు పక్కన వస్తువులను తినకూడదని మరో నెటిజన్ కామెంట్ చేశారు.
Read Also:HBD Sitara: కూతురికి పుట్టినరోజు అంటూ విషెస్ చెప్పిన సూపర్ స్టార్ దంపతులు..