Site icon NTV Telugu

Sara Tendulkar: క్రికెట్ స్టాండ్లో సారా టెండూల్కర్ హల్చల్.. గిల్ క్యాచ్ పట్టగానే ఏం చేసిందంటే..!

Sara

Sara

Sara Tendulkar: పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ స్టేడియంలో ఇండియా-బంగ్లాదేశ్ జట్ల మధ్య ప్రపంచకప్ 2023 మ్యాచ్ జరుగుతోంది. టీమిండియాను ఎంకరేజ్ చేయడానికి అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు క్రికెట్ స్టేడియానికి వచ్చారు. అందులో భాగంగానే భారత మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ కూడా వచ్చి క్రికెట్ ను ఎంజాయ్ చేశారు. ఇదిలా ఉంటే.. తన ఫ్రెండ్స్ తో మంచి మూడ్ లో ఉన్న సారా.. శుభ్ మాన్ గిల్ క్యాచ్ పట్టగానే సారా టెండూల్కర్ ఎగిరి గంతులేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఫొటో వైరల్ అవుతుంది. అందులో సారా చాలా సంతోషంగా కనిపించింది.

Read Also: Minister Niranjan Reddy: రాహుల్ ఎన్ని సార్లు వచ్చినా అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సే

బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 38వ ఓవర్‌లో శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో తౌహిద్ హృదయ్ క్యాచ్‌ను గిల్ అందుకున్నాడు. ఈ క్యాచ్ వీడియోను ఐసీసీ షేర్ చేసింది. శార్దూల్ వేసిన ఓవర్ షార్ట్ రెండో బంతిని బ్యాట్స్ మెన్ లెగ్ సైడ్ కొట్టేందుకు ప్రయత్నించగా.. బంతి బ్యాట్ పైభాగానికి తగిలి గాలిలోకి వెళ్లి నేరుగా శుభ్ మాన్ గిల్ చేతుల్లోకి వెళ్లింది. గిల్ ఈ క్యాచ్ పట్టిన తర్వాత.. సారా సంతోషకరమైన స్పందన సోషల్ మీడియాలో వైరల్ అయింది. వైరల్ రియాక్షన్‌లో సారా టెండూల్కర్ చిరునవ్వుతో చప్పట్లు కొడుతూ కనిపించింది.


Read Also: Putin: పుతిన్ ప్రసంగ సమయంలో యూరప్ ప్రతినిధుల వాకౌట్..

Exit mobile version