Site icon NTV Telugu

Sara Arjun : విజయ్ దేవరకొండ పై మనసు పారేసుకున్న ‘ధురంధర్’ భామ..

Sara Arjun

Sara Arjun

బాలీవుడ్ సెన్సేషనల్ హిట్ ‘ధురంధర్’ సినిమాతో నేషనల్ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ బ్యూటీ సారా అర్జున్, ఇప్పుడు టాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి, ఇప్పుడు హీరోయిన్‌గా ఎదుగుతున్న ఈ భామ.. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో ‘యుఫోరియా’, గౌతమ్ తిన్ననూరి ‘మ్యాజిక్’ సినిమాల్లో నటిస్తోంది. అయితే తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ‘యుఫోరియా’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సారా అర్జున్ సందడి చేసింది. ఈ సందర్భంగా ఆమె తన మనసులోని మాటను బయట పెట్టింది. టాలీవుడ్ హీరోల్లో తనకు విజయ్ దేవరకొండ అంటే అత్యంత ఇష్టమని, ఆయనే తన ఫేవరేట్ నటుడని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.

Also Read : Kiccha Sudeep : కిచ్చా సుదీప్ ‘మార్క్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

సారా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఇప్పుడు ఈ యంగ్ హీరోయిన్ కూడా ఆయన ఫ్యాన్ అని చెప్పడంతో రౌడీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం సారా నటిస్తున్న ‘యుఫోరియా’ సినిమా ఫిబ్రవరి 6న విడుదలకు సిద్ధమవుతోంది. యూత్ ఎంటర్టైనర్‌గా వస్తున్న ఈ చిత్రంతో సారా టాలీవుడ్‌లో పాగా వేయడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. భవిష్యత్తులో తన ఫేవరెట్ హీరో విజయ్ దేవరకొండతో కలిసి సారా అర్జున్ స్క్రీన్ షేర్ చేసుకుంటుందేమో చూడాలి.

Exit mobile version