NTV Telugu Site icon

Sankranthiki Vasthunam: బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న వెంకి మామ

Sankranthiki Vasthunam

Sankranthiki Vasthunam

Sankranthiki Vasthunam: 2025 సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలైన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. సినిమా విడుదలైన ప్రతిచోటా విజయవంతంగా దూసుకుపోతుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజ్ నిర్మించగా.. డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్‏కు ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ రివ్యూస్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తోంది. జనవరి 14న విడుదలైనప్పటి నుంచి ఫ్యామిలీ అడియన్స్ నుంచి సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. చిత్రంలో విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించగా.. ఈ సినిమాలో తన ఒకప్పటి స్టైల్, మేనరిజం, కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను మంత్రం ముగ్దుల్ని చేసారు. ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరీ హీరోయిన్లుగా మెప్పించారు. ఫ్యామిలీ అడియన్స్ కు సరిపోయే మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్‏ను అందించిన ఈ సినిమా సంక్రాంతి పండగ సందర్భంగా ఎక్కువ మంది ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. అది ఎంతలా అంటే సినిమా హాలులో ఉన్న కుర్చీలు సరిపోక బయటి నుండి కుర్చీ తెప్పించి షో లను వేశారంటే నమ్మండి.

Also Read: Payal Rajput : పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో మరో పాన్ ఇండియా మూవీ

ఇకపోతే, సంక్రాంతికి వస్తున్నాం సినిమా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.77 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మొదటి రోజే ఈ సినిమా రూ.45 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇది విక్టరీ వెంకటేశ్ కెరీర్ లోనే ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతుంది. అదికాక ఇంకా సంక్రాంతి సెలవులు ఉండడంతో మరింత కలెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మరింత మద్దతు వస్తుండటంతో, సంక్రాంతికి వస్తున్నాం 100 కోట్ల క్లబ్ లోకి చేరేందుకు మరెంతో దూరంలో లేదు.

Show comments