NTV Telugu Site icon

Sankranthiki Vasthunam : సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ రిలీజ్ పై తర్జన భర్జన

San Ott

San Ott

విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్  ‘సంక్రాంతికి వస్తున్నాం’. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ సంక్రాంతికి విడుదలై వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఐశ్వర్య రాజేష్‌, మీనాక్షి చౌదరి నాయికలుగా నటించారు. ఈ సినిమాను ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించారు. జనవరి 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా కేవల 13 రోజుల్లో రూ. 276 కోట్లకు పైగా గ్రాస్‌ వసూలు చేసింది. రీజినల్ సినిమాలలో అత్యధిక కలెక్షన్స్      సాధించిన చిత్రంగా నిలిచింది.

Also Read : HIT 3 : ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య అగ్గి రాజేసిన స్పెషల్ పోస్టర్

థియేటర్స్ లో విడుదలై రెండు వారాలు అవుతున్న కూడా ఇప్పటికీ ఈ సినిమా హౌస్‌ఫుల్‌ బోర్డ్స్ తో రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో ‘సంక్రాంతికి వస్తున్నాం  ఓటీటీలో స్ట్రీమింగ్‌ కు రెడీ అవుతుంది అనే టాక్ మొదలైంది. ఫిబ్రవరి రెండవ వారంలో ఈ సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోందని వార్తలు హల్ చల్ చేసాయి. సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటటీ నిర్మాణ సంస్థ జీ5 సొంతం చేసుకుంది. రిలీజ్ కు ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం జీ5  ఈ సినిమాను నాలుగు వారాలకె స్ట్రీమింగ్ చేయాల్సి ఉంది. కానీ ఇప్పటికి ఈ సినిమా థియేటర్స్‌లో విజయవంతంగా రన్ అవుతుండడం, కెలెక్షన్స్ సూపర్బ్ గా ఉండడంతో ఓటీటీ విడుదల కాస్త వెనక్కు వేయాలని జీ 5  కోరారట దిల్ రాజు.  ప్రస్తుతం ఈ విషయమై అటు నిర్మాణ సంస్థ ఓటీటీ మధ్య చర్చలు మొదలయ్యాయి. నిర్మాత మంచి కోరి డిజిటల్ స్ట్రీమింగ్ ను కాస్త వెనక్కు వేస్తారా లేదా ముందుగా అనుకున్న డేట్ కు డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తారా అనేది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.