నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో గతంలో వచ్చిన HIT మరియు HIT 2 లు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు ఈ సూపర్ హిట్ ఫ్రాంచైజీ కి సీక్వెల్ గా HIT 3 ని నిర్మిస్తున్నాడు నాని. ఈ సారి నాని స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్నారు. రూత్ లెస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు నాని. అయితే ఈ నెల 26 న రిపబ్లిక్ కానుకగా ఈ సినిమా నుండి నాని పోస్టర్ ను రిలీజ్ చేయగ ఊహించని విధంగా నానిపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది.
Also Read : RAM : యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో రికార్డు క్రియేట్ చేసిన డిజాస్టర్ సినిమా
HIT 3 నుండి రిపబ్లక్ డే విషెష్ తెలుపుతూ మెరిసిన గడ్డంతో కాప్ డ్రెస్స్ లో గన్ తో జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తూ పాకెట్ లో చేయి పెట్టుకుని మాస్ లుక్ లో రిలీజ్ చేసిన పోస్టర్ వివాదానికి దారి తీసింది. గన్ తో జాతీయ జెండాకు వందనం చేయడం ఏంటని ఓ స్టార్ హీరో ఫ్యాన్స్ కామెంట్స్ చేయడంతో వివాదం మొదలైంది. అందుకు బదులుగా ఆ సదరు స్టార్ హీరోని సింగిల్ ఎక్స్ప్రెషన్ హీరో అని కామెంట్స్ చేయడంతో వివాదం మరింత ముదిరింది. దీంతో స్టార్ హీరో ఫ్యాన్స్ నాని పై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రోజు రోజుకి సోషల్ మీడియాలో నెగిటివిటి హద్డులు దాటి సినిమాను చంపుకునేంత వరకు వెళ్తుంది. ఇటీవల వచ్చిన గేమ్ ఛేంజర్ అందుకు ఉదాహరణ. ఒకవైపు సదరు హీరోలు ‘ మేము మేము బాగానే ఉంటాం, మీరు బాగవ్వాలి ‘ అని చెప్తున్న కూడా హద్డులు దాటిన ఆవేశంతో ఫ్యాన్స్ డిజిటల్ వార్ కి తెరలేపుతున్నారు.