సంక్రాంతికి సినిమాల సందడి ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. సినిమా ఎలా ఉన్న పర్లేదు కానీ కలెక్షన్స్ మాత్రం ఓ రేంజులో ఉంటాయి.. ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలు అన్ని కూడా భారీ విజయాన్ని అందుకున్నాయి.. స్టార్ హీరోలు సూపర్ కంటెంట్ సినిమాతో పోటీకి దిగితే ఎలా ఉంటుందో మనం ఈసారి సంక్రాంతికి చూసాము.. ఇక వచ్చే ఏడాది సినిమాల సందడి ఏ విధంగా ఉంటుందో అనే ఆసక్తి జనాల్లో మొదలైంది..
ఈ సంక్రాంతికి ఐదు సినిమాలు విడుదల అవుతాయి అంటే.. థియేటర్లు పంచ లేక డిస్ట్రిబ్యూటర్స్ తలలు పట్టుకుని కూర్చున్నారు. చివరికి చేసేది లేక రవితేజ ఈగల్ పోటీ నుంచి తప్పుకో వలసి వచ్చింది. లేకపోతే థియేటర్ పంపకాల దగ్గర గొడవలు జరిగేవి.మరి అలాంటిది వచ్చే సంక్రాంతికి మెగాస్టార్, బాలయ్య కూడా బరిలోకి దిగితే ఎలా ఉంటుందో ఆలోచించండి.. ఈ ఏడాది జరిగినట్లు వచ్చే ఏడాది జరగకుండా ఇప్పటి నుంచే ముందుగా ప్లాన్ చేస్తున్నారు..
2025 సంక్రాంతి బరిలో దిగడానికి ముగ్గురు సీనియర్ హీరోలు సై అంటున్నారు. ఈ ముగ్గురిలో డేట్ ని అధికారికంగా అనౌన్స్ చేసింది మెగాస్టార్ చిరంజీవి మాత్రమే. రీసెంట్ గా షూటింగ్ సెట్స్ లో జాయిన్ అయిన చిరంజీవి ఫుల్ జోష్ మీద కనిపిస్తున్నారు. పైగా జనవరి 10 మూవీ విడుదల చేయబోతున్నట్లు విశ్వంభర టీం అధికారికంగా పోస్టర్ని విడుదల చేసి ప్రకటించింది.. ఇక బాలయ్య బాబీ సినిమా కూడా అప్పుడే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది.. అలాగే నాగార్జున నటిస్తున్న కొత్త సినిమా కూడా ఈ సంక్రాంతికే విడుదల కాబోతుందని సమాచారం.. ఏ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి..