Sanju Samson T20 Captain: T20 తర్వాత కెప్టెన్‌గా సంజూ శాంసన్.. మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు..
- టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆకర్షించిన సంజూ..
- సూర్యకుమార్ తర్వాత టీ20 కెప్టెన్‌గా సంజూ అయ్యే అవకాశం..
- భారత మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ అభిప్రాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 ప్రపంచకప్‌లో సంచలన ప్రదర్శన చేసిన సంజూ శామ్సన్ మీద ఇప్పుడు ప్రశంసల జల్లు కురుస్తోంది. భారత మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ తాజాగా సంజూ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సూర్యకుమార్ యాదవ్ తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్ అయ్యే అన్ని అర్హతలు సంజూ శామ్సన్‌కు ఉన్నాయని కైఫ్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రపంచకప్‌లో సంజూ ఆట తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. వరుసగా మూడు హాఫ్ సెంచరీలు బాదడమే కాకుండా..సెమీఫైనల్ , ఫైనల్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడి భారత్‌కు మూడోసారి ప్రపంచకప్ అందించడంలో ముఖ్య పాత్ర పోషించారు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 321 పరుగులు చేసి… ఒకే టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన విరాట్ కోహ్లీ (2014) రికార్డును కూడా సంజూ అధిగమించారు.
Also Read:TGRPDCL: తెలంగాణలో మరో డిస్కం ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
Also Read
- Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?
- Delhi Tour: ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. అమిత్ షా, సీఆర్ పాటిల్‌తో కీలక భేటీలు!
- Bhuvneshwar Kumar: స్వింగ్ కింగ్ 'భూవీ' ఈజ్ బ్యాక్.. టీమిండియాకు రీఎంట్రీ ఖాయమేనా..!
- Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!
మొహమ్మద్ కైఫ్ ఏమన్నారంటే..?
‘భవిష్యత్తులో భారత జట్టుకు కెప్టెన్ ఎవరవుతారో ఇప్పుడే చెప్పడం కష్టమే కానీ.. సంజూ శామ్సన్ మాత్రం కచ్చితంగా ఆ రేసులో ఉంటాడు. ఎందుకు ఉండకూడదు..? కెప్టెన్‌గా అతనికి ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను నడిపించిన అనుభవం ఉంది. బౌలింగ్ మార్పులు చేయడం, సరైన ఆటగాళ్లను ఎంపిక చేయడం అతనికి బాగా తెలుసు’.. అని కైఫ్ పేర్కొన్నారు.
ఇంకా ఏమన్నారంటే.. టీ20 ఫార్మాట్‌లో ఎంతో అనుభవం ఉన్న ఆటగాడు కావాలి.. సంజూకు 31 ఏళ్లే కాబట్టి అతనికి ఇంకా చాలా సమయం ఉందన్నారు. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ బాగా ఆడుతున్నాడు. ఒకవేళ సూర్య తప్పుకోవాలని అనుకుంటే.. ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి సంజూ సరైన వ్యక్తి అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకానొక దశలో ఫామ్ లేక జట్టులో చోటు కోల్పోయిన సంజూ, మళ్ళీ అద్భుతంగా పుంజుకున్నాడు. ఇలాంటి మొండితనం ఉన్న వారే మంచి నాయకులు అవుతారన్నారు.
Also Read:Rain In Telangana: చల్లని కబురు చెప్పిన తెలంగాణ వాతావరణ శాఖ.. ఈ జిల్లాల్లో వర్షాలే వర్షాలు..
రెండో అవకాశం.. అదిరిపోయే ఫలితం..
టోర్నీకి ముందు సంజూ ఫామ్ మీద విమర్శలు వచ్చాయి. దీంతో ఇషాన్ కిషన్‌కు అవకాశం ఇచ్చారు. కానీ కివీస్ బౌలర్ల ధాటికి టాప్ ఆర్డర్ తడబడటంతో సంజూకు మళ్ళీ అవకాశం దక్కింది. ఆ అవకాశాన్ని రెండు చేతులా పట్టుకున్న సంజూ.. వెస్ట్ ఇండీస్ మీద క్వార్టర్ ఫైనల్ నుంచి న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ వరకు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. మొత్తానికి.. సంజూ శామ్సన్ తన బ్యాట్‌తోనే కాకుండా తన నాయకత్వ లక్షణాలతో కూడా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. భవిష్యత్తులో అతను నీలి రంగు జర్సీలో కెప్టెన్‌గా కనిపిస్తాడేమో చూడాలి మరి.
తాజావార్తలు
-
Virat Kohli Duck: మరోసారి విరాట్ కోహ్లీ డకౌట్.. కింగ్‌ను సున్నాకే పెవిలియన్‌కు పంపిన బౌలర్లు వీరే!
-
Lenin : అఖిల్ ‘లెనిన్’ మూవీలో స్పెషల్ రోల్ ?
-
Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?
-
Delhi Tour: ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. అమిత్ షా, సీఆర్ పాటిల్‌తో కీలక భేటీలు!
-
Bhuvneshwar Kumar: స్వింగ్ కింగ్ ‘భూవీ’ ఈజ్ బ్యాక్.. టీమిండియాకు రీఎంట్రీ ఖాయమేనా..!