NTV Telugu Site icon

Sanju Samson Six: సంజూ శాంసన్ భారీ సిక్స్.. మహిళా అభిమాని ముఖానికి తగిలిన బంతి.. వీడియో

Sanju Samson Six

Sanju Samson Six

Sanju Samson Six: దక్షిణాఫ్రికా సిరీస్‌లో భారత బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ విచిత్రమైన రీతిలో బ్యాటింగ్ చేశాడు. ఒక మ్యాచ్‌లో సెంచరీ చేస్తే.. మరో రెండు మ్యాచ్‌లలో డకౌట్ కాగా.. చివరి మ్యాచ్‌లో మళ్లీ సెంచరీతో చెలరేగిపోయాడు. జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో సంజూ బ్యాట్ ఝులిపించాడు. సంజూ శాంసన్ 56 బంతులు ఎదుర్కొని 109 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. శాంసన్ తన ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 9 సిక్సర్లు బాదాడు. ఈ ఇన్నింగ్స్‌లో సంజూ శాంసన్ ఒక మాన్‌స్టర్ సిక్స్ కొట్టాడు. బంతి నేరుగా స్టాండ్స్‌లో పడింది. ఆ బంతి గ్రౌండ్‌ను తాకిన అనంతరం వెళ్లి ఓ మహిళా అభిమాని ముఖంపై తాకింది. దాని కారణంగా ఆమె ఏడవడం ప్రారంభించింది. మహిళ బంతిని తగలడంతో సంజూ శాంసన్ కూడా కాస్త భయపడ్డాడు. అతని మొహం చూస్తుంటే చాలా పశ్చాత్తాపం పడుతున్నట్టు అనిపించింది.

Read Also: IND vs SA: మ్యాచ్‌ గెలిచిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ ట్రోఫీని ఏం చేశాడో చూడండి(వీడియో)

భారత జట్టు 3-1తో సిరీస్‌ కైవసం
దక్షిణాఫ్రికా-భారత్ జట్ల మధ్య 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరి, నాలుగో మ్యాచ్ జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 135 పరుగులు చేసి 3-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 1 వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది. శాంసన్ సెంచరీతో పాటు తిలక్ వర్మ కూడా సెంచరీ సాధించాడు. తిలక్ వర్మ 47 బంతుల్లో అజేయంగా 120 పరుగులు చేశాడు. తిలక్ వర్మ తన ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 10 సిక్సర్లు బాదాడు. వరుసగా 2 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు సాధించిన ఘనత సాధించాడు.

148 పరుగులకే కుప్పకూలిన దక్షిణాఫ్రికా
284 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌లో పూర్తిగా పరాజయం పాలైంది. ఆతిథ్య జట్టు 18.2 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌటైంది. దక్షిణాఫ్రికా తరఫున ట్రిస్టన్ స్టబ్స్ అత్యధికంగా 43 పరుగులు చేశాడు. డేవిడ్ మిల్లర్ కూడా 36 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. భారత్ తరఫున అర్ష్‌దీప్ సింగ్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. హార్దిక్ పాండ్యా, రమణదీప్ సింగ్, రవి బిష్ణోయ్ కూడా తలో వికెట్ తీశారు.