Sanju Samson: “జట్టులో చోటు లేనప్పుడు కుంగిపోయా.. కానీ”.. విక్టరీ వెనకున్న కన్నీళ్లను పంచుకున్న సంజూ శామ్సన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanju Samson: భారత్ టీ20 వరల్డ్ కప్ 2026ను కైవసం చేసుకుంది. మూడు ట్రోఫీలు సాధించిన ఏకైక టీమ్‌గా చరిత్ర సృష్టించింది. ఈ చరిత్ర వెనుక ప్లేయర్స్ పడిన కష్టం అంతా ఇంతా కాదు.. టీమిండియాలోని కొందరు ప్లేయర్స్ అనేక విమర్శలకు గురై చివరకు సత్తా చాటారు. ముఖ్యంగా ఈ సీజన్లో కీలక పాత్ర పోషించిన ప్లేయర్ సంజూ శామ్సన్. తాజాగా సంజూ తన ప్రయాణానికి సంబంధించిన కీలక విషయాలను, జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులను ‘ఇండియా టుడే కాన్క్లేవ్’ బయట పెట్టాడు. టోర్నీ ఆరంభంలో జట్టులో స్థానం కోల్పోవడంతో మానసికంగా ఎంతో కుంగిపోయినట్లు వెల్లడించాడు. వాస్తవానికి.. న్యూజిలాండ్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో రాణించకపోవడంతో సంజూను పక్కన పెట్టారు. ప్రపంచకప్ తొలి దశలో సంజూ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కోల్పోయాడు. ఆ సమయంలో తన సొంత సహచరులతోనే పోటీ పడాల్సి రావడం తనకు ఇబ్బందిగా అనిపించిందని చెప్పాడు.
READ MORE: RaashiiKhanna : ‘తెలుసుకదా’ సినిమా ప్లాప్ అవుతుందని ముందే తెలుసు.. కానీ నా మాట ఎవరు వినలేదు
Also Read
- PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
- Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
- Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
- India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
సంజూ మాట్లాడుతూ.. వరల్డ్ కప్పు గెలవాలనేది నా డ్రీమ్. కానీ మొదట్లో ఫైనల్ టీమ్‌లో నా పేరు లేకపోవడంతో నేను ఎంతగానో బాధ పడ్డాను. ప్లేయింగ్ ఎలెవన్‌లో లేకపోవడం నన్ను కలచివేసింది. కొన్ని రోజుల విరామం తర్వాత సూపర్ 8 దశలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో నాకు అవకాశం దక్కింది. ఆ సమయంలో మేనేజ్మెంట్ నాపై ఉంచిన నమ్మకం నా ఆలోచన దృక్పథాన్ని మార్చేసింది. జట్టు కోసం ఆడాలనే నా తపన రెట్టింపు అయ్యింది. ఆ పట్టుదలతో వెస్టిండీస్‌పై 97, సెమీస్, ఫైనల్లో 89 చొప్పున పరుగు చేశాను.” అని చెప్పాడు. ఇక సంజూ, అభిషేక్ మధ్య ఉన్న మైదానంలోని సమన్వయం గురించి సంజూ ఆసక్తికర విషయాలు చెప్పాడు. ఇద్దరి మధ్య ‘పంజాబీ ఫ్రెండ్షిప్’ నడుస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.. అభిషేక్ చాలా ధైర్యవంతుడన్నాడు. అతనితో కలిసి బ్యాటింగ్ చేయడం తనకు చాలా ఇష్టమని వెల్లడించాడు.
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
-
Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
-
Post Office Schemes: బంపర్ స్కీమ్.. పైసా రిస్క్ లేకుండా నెలనెలా రూ.9 వేలకు పైగా ఆదాయం! ఓ లుక్ వేయండి
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!