ఐపీఎల్ ముగియగానే టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. 2024 జూన్ 1 నుండి వెస్టిండీస్, అమెరికాలో ఈ మెగా టోర్నీని నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. మే 1తో జట్టు ప్రకటన గడువు ముగియనుంది. దీంతో ఈరోజు లేదా రేపు జట్టు ప్రకటించే అవకాశముంది. అయితే.. టీమిండియాలో వికెట్ కీపర్ గా సంజూ శాంసన్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మరోవైపు.. అతనికి పోటీగా రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ వంటి స్టార్ ఆటగాళ్లు పోటీలో ఉన్నారు.
కానీ.. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా ఉన్న సంజూ శాంసన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ ల్లో 161.08 స్ట్రైక్ రేట్‌తో 385 పరుగులు చేశాడు. అందులో నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఆరెంజ్ క్యాప్ జాబితాలో శాంసన్ నాలుగో స్థానంలో ఉన్నాడు. మరోవైపు.. కేఎల్ రాహుల్ కూడా 144 స్ట్రైక్ రేట్‌తో 378 పరుగులు చేశాడు. రాహుల్.. ఆరెంజ్ క్యాప్ జాబితాలో ఐదవ స్థానంలో ఉన్నాడు.
Chandini Chowdary: ఆడేసుకుంటున్న నెటిజన్లు.. నేనలా అనలేదంటున్న చాందిని చౌదరి
ఐపీఎల్ 2024లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో రిషబ్ పంత్ ఆరో స్థానంలో ఉన్నాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ 10 మ్యాచ్‌లలో 160.60 స్ట్రైక్ రేట్‌తో 371 పరుగులు చేశాడు. మూడు అర్ధ సెంచరీలు సాధించాడు. కిషన్ పెర్ఫార్మెన్స్ ఇంతవరకూ ఫర్వాలేదు. కిషన్ 9 మ్యాచ్‌లలో 165.62 స్ట్రైక్ రేట్‌తో 212 పరుగులు చేశాడు. ESPNcricinfo నివేదిక ప్రకారం.. సంజు శాంసన్ వికెట్ కీపర్‌గా ఎంపిక కావడం ఖాయం అని తెలుస్తోంది. ఎందుకంటే.. వీరందరి కంటే శాంసన్ రేసులో ముందు వరుసలో ఉన్నాడు.
టాప్-4 పేర్లు దాదాపు ఖరారయ్యాయి
ఐపీఎల్‌కు ముందే భారత టాప్-4 బ్యాట్స్‌మెన్‌ల పేర్లు ఖరారయ్యాయి. కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ పేర్లు ఆమోదం పొందడం ఖాయం. మరోవైపు.. స్టార్ ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్ మధ్య గట్టి పోటీ నెలకొంది. హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఫిట్‌నెస్ ఆందోళన కలిగించే విషయమని క్రిక్‌ఇన్ఫో పేర్కొంది. ప్రస్తుత సీజన్‌లో హార్ధిక్ పెద్దగా రాణించలేదు. శివమ్ దూబే లేదా రింకూ సింగ్‌లో ఒకరితో పాటు సంజూ శాంసన్ లేదా కేఎల్ రాహుల్‌లలో ఒకరు ఉంటారని పేర్కొంది. స్పిన్నర్ల కోటాలో కుల్దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకోవడం ఖాయమని క్రిక్‌బజ్ కథనం పేర్కొంది.
