Chandini Chowdary Clarity on IPL Teams Controversy: టాలీవుడ్ హీరోయిన్, తెలుగు అమ్మాయి ‘చాందిని చౌదరి’ మొదటి నుంచి కాస్త వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ కొత్త కొత్త పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ నేపధ్యంలోనే అతి త్వరలో చాందిని చౌదరి ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో అజయ్ ఘోష్ సరసన నటిస్తూ కొత్త కథతో థియేటర్ లో రాబోతోంది. మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో ఓ మీడియా ప్రతినిధి హీరోయిన్ ను ‘ మీ ఫేవరెట్ ఐపిఎల్ టీం ఏంటి’ అని అడగగా.. దానికి హీరోయిన్ సమాధానం ఇస్తూ తాను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ చూడలేదని., కాకపోతే కేవలం సీసీఎల్ మ్యాచ్ లు చూశాను అంటూ చెప్పుకొచ్చింది. ఒక్క మ్యాచ్ అయిన ఐపీఎల్ మ్యాచ్ చూసి తర్వాత తాను టీమ్స్ నుంచి ఏది ఫేవరెట్ అని సెలెక్ట్ చేసుకుంటాను అని పేర్కొంది. అంతేకాక మాది ఆంధ్ర కాబట్టి మా ఆంధ్రకు టీం లేదని తెలిపింది.
Amrita Pandey: నటి అనుమానాస్పద మృతి కేసులో షాకింగ్ న్యూస్
అయితే తెలుగు రాష్ట్రాల నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఉంది కదా అని అంటే ‘మాది ఆంధ్ర. మాకు ఆంధ్ర టీం లేదు’ అని చాందిని పేర్కొంది. దీంతో కొంతమంది ఆమె తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్ టీమ్ ను ఓన్ చేసుకోలేక పోతోంది, ఆమె సినిమాలు కేవలం ఆంధ్ర వాళ్ళు మాత్రమే చూస్తున్నారా? తెలంగాణ వాళ్ళు చూడడం లేదా అంటూ ట్రోల్స్ మొదలుపెట్టారు. ఈ అంశం కాస్త దారి తప్పేలా కనిపించడంతో వెంటనే ఆమె సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చింది. నా ఫేవరెట్ ఐపిఎల్ టీం ఏది అని అడిగితే నేను మ్యాచ్ లు చూస్తా, చూశాకే చెబుతా అన్నాను. అలాగే నేను ఆంధ్ర కాబట్టి ఆంధ్ర టీం కూడా ఉంటే బాగుండు అన్నాను. అయితే ట్రేండింగ్ కంటెంట్ కి తగ్గట్టు వీడియో ఎడిట్ చేసి అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ లో వీడియోలు పెట్టడం చాలా సులభం కదా అని అంటూ ఆమె పేర్కొంది. నేను నా రెండు తెలుగు రాష్ట్రాలను చూసి గర్విస్తా, ఎందుకంటే నేను ఆ రెండు రాష్ట్రాలకు చెందిన దాన్ని కాబట్టి, ఈ ఏడాది హైదరాబాద్ జట్టుకి ఆల్ ధీ బెస్ట్ అంటూ ఆమె రాసుకొచ్చింది.
— Chandini Chowdary (@iChandiniC) April 29, 2024