Sangeetha: ఒక్క ఛాన్స్ అంటూ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది సంగీత. కృష్ణవంశీ దర్శకత్వంలో ఖడ్గం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. మంచి నటనతో ప్రత్యేక అభిమానులను సొంతం చేసుకుంది. ఇక ఎక్కువగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరైన సంగీతకు నిజ జీవితంలో మెకు సినిమా కష్టాలు తప్పలేదు. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్క హీరోయిన్ జీవితంలో ఒక్కొక్క విషాదం ఉంటుంది. అలాగే కొంతమంది హీరోయిన్ల జీవితంలో తల్లిదండ్రులే విలన్స్ గా ఉంటారు. అయితే అలాంటి హీరోయిన్ల జాబితాలో సంగీత కూడా ఒకరు. సంగీత కెరియర్ పీక్స్ ఉన్నప్పుడే ప్రముఖ సింగర్ కృష్ ని పెళ్లి చేసుకొని సినిమాలకు స్వస్తిచెప్పింది. మళ్లీ ఈ మధ్యకాలంలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి అమ్మ, అత్త పాత్రల్లో నటిస్తోంది. ఇక మహేష్ బాబు హీరోగా వచ్చిన సరేలేరు నీకెవ్వరు లో రష్మిక కి తల్లిగా నటించి మెప్పించింది.
Read Also:Uttar Pradesh: తాగుబోతు వరుడికి షాక్ ఇచ్చిన పెళ్లికూతురు..
అలాగే హారర్ స్టోరీ నేపథ్యంలో వచ్చిన మసూద సినిమాలో కూడా కీలకపాత్రలో నటించింది. అలాంటి ఈ హీరోయిన్ గురించి అప్పట్లో తన తల్లి సంచలన వ్యాఖ్యలు చేసింది. నా కూతురు నన్ను ఇంటి నుండి వెళ్లిపోమ్మని చాలా టార్చర్ చేస్తుంది అంటూ మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేసింది. అయితే ఈ విషయంలో నటి సంగీత అప్పట్లో క్లారిటీ ఇస్తూ.. అసలు ఇలాంటి తల్లి కడుపులో పుట్టినందుకు నాకు చాలా సిగ్గుగా ఉంది..నా తల్లి అని చెప్పుకోవడానికి నాకు ఏదోలా అనిపిస్తుంది. నేను 13 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నన్ను ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం చేశారు. కానీ నాకు హీరొయిన్ అవ్వాలని అస్సలు ఇష్టం లేదు. నా అన్నదమ్ములిద్దరినీ మందుకు బానిసై వారి జీవితాలు నాశనం చేసుకున్నారు. కానీ ఆ టైంలో వారికి డబ్బు కావాలి అనే ఉద్దేశంతో నన్ను సినిమాల్లో నటించమని టార్చర్ చేసి నన్ను ఒక మనీ మిషన్ గా వాడుకున్నారు. నేను సంపాదించిన డబ్బులతో జల్సాలు చేస్తున్నారు. ఇప్పటికి కూడా మా అమ్మ అన్న ఇద్దరు నేను సంపాదించి కొనుక్కున్న నా ఇంట్లోనే ఉంటారు. అయితే లేనిపోని దుష్ప్రచారాలు నామీద చేసి సమాజంలో నాపై చెడు ప్రచారం చేస్తుంది. అంతేకాదు నన్ను ఈ విధంగానైనా రోడ్డుమీదికి లాగుదామని చూస్తోంది. అసలు ఇలాంటి తల్లి ఎవరికి ఉండకూడదు అంటూ నటి సంగీత సంచలన వ్యాఖ్యలు చేసింది.
Read Also:Ray Stevenson : బిగ్ బ్రేకింగ్.. ఆర్ఆర్ఆర్ స్కాట్ దొర ఇకలేరు