Sandeep Reddy: వరంగల్ జిల్లాలో శుక్రవారం ఒక పెళ్లి మండపంలో సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రత్యక్షం అయ్యారు. ఈ పెళ్లి ఎవరిదో తెలుసా.. ఈ సెన్సేషనల్ డైరెక్టర్ దగ్గర అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి సూపర్ హిట్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన శ్రీకాంత్‌ది. తన సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన వ్యక్తి పెళ్లికి కేవలం శుభాకాంక్షలు చెప్పి వదిలేయకుండా ఆయనే స్వయంగా పెళ్లి వచ్చి నూతన దంపతులను ఆశీర్వదించడంతో పెళ్లికి వచ్చిన వాళ్లు సందీప్ రెడ్డి వంగా తీరును కొనియాడుతున్నారు.
READ ALSO: Priyank Kharge: ఆర్ఎస్ఎస్ కోసం విద్యార్థుల్ని బలవంతంగా తీసుకెళ్లారు.. బీజేపీపై ఆరోపణలు..
అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్‌లో ఒక సంచలనం సృష్టించిన యువ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాతో ఆయనకు యూత్ యమ క్రేజ్ ఏర్పడింది. అర్జున్ రెడ్డి సక్సెస్ తర్వాత ఆయన హిందీలో అర్జున్ రెడ్డిని కబీర్ సింగ్ పేరుతో తీసి సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. దీంతో ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత ఆయన రణబీర్ కపూర్‌తో యానిమల్ మూవీ తీసి సినిమా రికార్డులు సృష్టించారు. ప్రస్తుతం ఆయన ప్రభాస్‌తో స్పిరిట్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాపై చిత్ర పరిశ్రమలో మంచి ఊహాగానాలు ఉన్నాయి. ఈ సినిమా కచ్చితంగా ఇండస్ట్రీ రికార్డలను తిరగ రాస్తుందని ప్రభాస్ అభిమానులు నమ్మకంగా ఉన్నారు. స్పిరిట్ సినిమాలో డాన్ లీ ప్రతినాయకుడిగా కనిపించనున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ ఊహాగానాలు నిజం అయితే సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోతాయి. ఇవన్నీ పక్కన పెడితే తన దగ్గర పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ పెళ్లికి అంత పెద్ద డైరెక్టర్ రావడం అనేది పెళ్లి మండపంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
READ ALSO: Mali Bamako JNIM: ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా చేతిలోకి ఆ దేశ రాజధాని?
