NTV Telugu Site icon

Sudeep : హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో కూతురు

New Project 2025 02 23t165212.167

New Project 2025 02 23t165212.167

Sudeep : శాండిల్ వుడ్ స్టార్ హీరో కిచ్చ సుదీప్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. రాజ‌మౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమాతో ఇక్కడి ప్రేక్షకుల గుండెల్లో విలన్ గా గుర్తుండిపోయాడు ఆయన. ఈగ మూవీలో తన నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఆ సినిమా త‌ర్వాత సుదీప్ కన్నడలో చేసిన సినిమాలన్నీ తెలుగులో కూడా డబ్ అవుతున్నాయి. రాజ‌మౌళి ద‌ర్శకత్వంలో వ‌చ్చిన బాహుబ‌లి సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించిన సుదీప్ ఆ తర్వాత నుంచి తెలుగు సినిమాల్లో కనిపించలేదు. తెలుగులో డైరెక్ట్ సినిమాలు చేయ‌క‌పోయినా ఆయన న‌టించిన సినిమాలు తెలుగులో డ‌బ్ అవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం కన్నడలో సుదీప్ స్టార్ హీరోగా పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు.

Read Also:Group-2 Mains: సెంటర్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో అంధ విద్యార్థినికి అన్యాయం..

ఇటీవల ఆయన నటించిన మ్యాక్స్ సినిమా బ్లాక్ బ‌స్టర్ హిట్టైన విష‌యం తెలిసిందే. ఓ వైపు సినిమాల్లో న‌టిస్తూనే మ‌రోవైపు క‌న్నడ బిగ్ బాస్ కు వ్యాఖ్యాత‌గా వ్యవహరిస్తున్నాడు సుదీప్. రీసెంట్ గానే ఓ సీజ‌న్ ను ముగించిన సుదీప్ స్క్రీన్ పై ఎంతో ఫిట్ గా క‌నిపిస్తాడు. ఆయ‌న వ‌య‌సు 52 సంవత్సరాలంటే ఎవరూ నమ్మరు. అంతేకాదు 52 ఏళ్ల సుదీప్ కు 21ఏళ్ల కూతురు కూడా ఉంది. సుదీప్ గురించి, ఆయ‌న ఫ్యామిలీ గురించి క‌న్నడ ఆడియెన్స్ కు మాత్రం బాగా తెలుసు. సుదీప్ కూతురి పేరు సాన్వీ సుదీప్. సోష‌ల్ మీడియాలో ఆమెకు మంచి క్రేజ్ ఉంది. అయితే ఇప్పుడు సాన్వీ సుదీప్ పేరు క‌న్నడ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తుంది.

Read Also:Crime: వేరే వ్యక్తితో యువతి రిలేషన్.. స్నేహితులతో కలిసి మాజీ ప్రియుడు గ్యాంగ్ రేప్..

ఇప్పటికే త‌న అందాల‌తో సోష‌ల్ మీడియాలో మంచి క్రేజ్ ద‌క్కించుకున్న సాన్వీ సుదీప్, త్వరలోనే సినిమాల్లోకి రానుంద‌ని క‌న్నడ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సాన్వీకి యాక్టింగ్ కంటే సింగింగ్ అంటేనే ఇష్టమని.. ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పకనే చెప్పింది. అందులో భాగంగానే అమ్మడు మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా చేసింది. ఆల్రెడీ సాన్వీ జిమ్మీ అనే సినిమాలో ఓ పాట కూడా పాడుతుందట. హీరోయిన్ గా వెండితెర అరంగేట్రానికి రెడీ అవుతుందని అంటున్నారు.