120Hz డిస్ప్లే, Dimensity 6300తో Samsung Galaxy A07 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samsung Galaxy A07 5G: శాంసంగ్ (Samsung) తన A-సిరీస్‌లో కొత్తగా గాలక్సీ A07 5G (Galaxy A07 5G) స్మార్ట్‌ఫోన్ ను భారత్ లో లాంచ్ చేసింది. పెద్ద డిస్ప్లే, భారీ బ్యాటరీ సపోర్ట్‌తో ఈ ఫోన్ బడ్జెట్ 5G సెగ్మెంట్లో వినియోగదారులను ఆకర్షించేలా తాయారు చేయబడింది.
OPPO K13 Price Hike: షాకింగ్.. తగ్గాల్సింది పోయి భారీగా పెరిగిన ‘ఒప్పో కే13’ ధర!
Also Read
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
- Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
ఈ కొత్త మొబైల్ లో 6.7-అంగుళాల HD+ డిస్ప్లేతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ అందించారు. ఫోన్ బ్యాక్ ప్యానెల్లో ‘గ్లాస్ ఫైబర్ రీన్ఫోర్స్డ్ పాలిమర్ (GFRP)” ఉపయోగించారు. ఇది బలాన్ని పెంచుతూ స్లిమ్ డిజైన్‌ను అందిస్తుంది. అలాగే ఇది IP54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ ఉంది. ఈ మొబైల్ లైట్ వైలెట్, లైట్ గ్రీన్, బ్లాక్ రంగులలో లభిస్తుంది. ఇంకా ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50MP ప్రధాన కెమెరా, 2MP డెప్త్ సెన్సర్ ఉండగా.. సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరా అందించారు.
ఇందులో అత్యాధునిక మీడియాటెక్ డిమెంసిటీ 6300 ప్రాసెసర్ ఉంది. 4GB / 6GB RAM, 128GB స్టోరేజ్ తో వస్తుంది. అవసరమైతే మైక్రోSD ద్వారా 1TB వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6000mAh బ్యాటరీ ఉంది. ఇది 25W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది (బాక్స్‌లో ఛార్జర్ ఉండదు). ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత One UI 8.0పై పనిచేస్తుంది. శాంసంగ్ ఈ మోడల్‌కు 6 సంవత్సరాల OS అప్డేట్స్, సెక్యూరిటీ అప్డేట్స్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అదనంగా Samsung Knox Vault సెక్యూరిటీ సిస్టమ్, ఫింగర్‌ప్రింట్ మరియు ఫేస్ అన్‌లాక్, Auto Blocker ఫీచర్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.
శాంసంగ్ గాలక్సీ A07 5G రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో 4GB + 128GB వేరియంట్ రూ. 15,999 కాగా, 6GB + 128GB వేరియంట్ రూ. 17,999 గా నిర్ణయించారు. ఇంకా ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులు లేదా UPI ద్వారా కొనుగోలు చేస్తే రూ. 1,000 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అలాగే 18 నెలల వరకు నో-కాస్ట్ EMI ఆప్షన్ ఉంది. ఈ ఫోన్ శాంసంగ్ స్టోర్లు, రిటైల్ అవుట్లెట్లు, ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంటుంది.
MORE stunning shots 📸
MORE weekend binges 🔋
MORE lag-free calls 🗣️Make every day #MoreAwesome with the all-new #GalaxyA07 5G 💖
With a 50MP Dual Camera, massive 6000mAh battery, and superfast 5G speeds, get so much more from your phone. pic.twitter.com/J91UbjhhHe— Samsung India (@SamsungIndia) February 5, 2026
తాజావార్తలు
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
-
New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
-
Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?