Samantha : నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత చాలా కుంగిపోయింది. ఈ మధ్య కాలంలోనే ఆమె మయోసైటిస్ బారిన పడ్డారు. ఒకవైపు మయో సైటిస్‌తో బాధపడుతూనే ఆమె సినిమాల్లో నటిస్తున్నారు. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నప్పుడే ఆమె మయో సైటిస్ బారిన పడింది. అందరూ తాను మళ్లీ సినిమాల్లో నటించదేమో అన్న అనుమానం వ్యక్తం చేశారు. కానీ తనకు తాను నిలదొక్కుకుని రీ ఎంట్రీ ఇచ్చింది. ఓ వైపు ట్రీట్‌మెంట్ తీసుకుంటూనే సినిమాల్లో నటించింది. మళ్లీ ఇప్పుడు తను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన సమంత ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
Read Also: Mahesh Babu: సూపర్‌స్టార్ మహేష్ లాంచ్ చేసిన ‘ప్రేమ విమానం’ టీజర్…
తాజాగా సమంత హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న ఫొటో ఇన్ స్టాలో షేర్ చేసింది. అందులో ముఖానికి మాస్క్ పెట్టుకుని హాస్పిటల్ బెడ్ పై పడుకుని ఉంది. ఆ ఫొటో చూసిన ఆమె ఫ్యాన్స్, నెటిజన్స్ ఆమెకు ధైర్యంగా ఉండాలని కామెంట్ చేస్తున్నారు. ఫోటో కింద తాను హైపర్ బారిక్ థెరపీని తీసుకుంటున్నట్లు సమంత తెలిపింది. పలు వ్యాధులకు ఈ థెరపి చక్కగా పని చేస్తుందని ఆమె వివరించింది. శరీరంలో డ్యామేజింగ్ టిష్యూలు ఈ థెరపి కారణంగా బాగుపడతాయంటూ సమంత తెలియజేసింది.
Read Also:lays off employees: హాలో విభాగం మూసివేత.. ఉద్యోగులను తొలగించిన అమెజాన్!
సమంత తాజాగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకే ప్రాధాన్యత ఇస్తోంది. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల్లో నటించడానికి ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. తాను ఇటీవల నటించిన యశోద, శాకుంతలం సినిమాలన్నీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలే. త్వరలో సిటాడెల్ తెలుగు వెర్షన్ వెబ్ సిరిస్ ద్వారా తన అభిమానులను అలరించనుంది. రాజ్ డీకే ఈ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో సామ్ యాక్షన్ సీక్వెన్స్‌లలో నటిస్తోంది. మరో వైపు విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో హీరోయిన్‌గానూ నటిస్తోంది. సెప్టెంబర్ 1న ఈ చిత్రాన్ని విడుదల చేయటానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.