స్టార్ హీరోయిన్ సమంత. తాజాగా విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ సినిమాలో నటించింది. ఈ సినిమా సెప్టెంబర్ 1న ఎంతో గ్రాండ్ గా విడుదల కానుంది.అలాగే బాలీవుడ్ యాక్టర్ వరుణ్ ధావన్ తో కలిసి క్రేజీ సిరీస్ ‘సిటడెల్’ లో కూడా నటించింది.ఈ రెండు చిత్రాలకు సంబంధించి షూటింగ్ కూడా పూర్తి అయింది..దీనితో సమంత ప్రస్తుతానికి సినిమాలకు బ్రేక్ ఇచ్చి తన పూర్తి సమయాన్ని ఎంతో ఆనందంగా గడుపుతుంది.ఈ సందర్భం గా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ వెకేషన్ ను బాగా ఎంజాయ్ చేస్తుంది. ఎప్పటికప్పుడు ఆసక్తికరంగా పోస్టులు పెడుతూ ఎంత గానో ఆకట్టుకుంటోంది. సమంత దాదాపు ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంటున్నట్టు అధికారికంగా ప్రకటించింది..
కొద్దికాలంగా ఆమె ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటుండటం తో పూర్తిగా కోలుకునే వరకు షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చినట్లు సమాచారం.ఈ సమయాన్ని సమంత తన స్నేహితులతో కలిసి ఎంతో సరదగా గడుపుతుంది.. ఈ సందర్భం గా దేవాలయాలను, మెడిటేషన్ సెంటర్లు మరియు వేకెషన్ల కు వెళ్తు ఎంతో ఆనందంగా గడిపేస్తుంది..ఈ భామ సద్గురు ఈషా సెంటర్ లో కనిపించిన సంగతి తెలిసిందే.ఇక ప్రస్తుతం సమంత ఇండోనేషియా లో ఎంజాయ్ చేస్తుంది.బ్యూటీఫుల్ లోకేషన్లను సందర్శిస్తూ ఎంతో రిలాక్స్ అవుతుంది.. తాజాగా సమంత ఇండోనేషియాలోని ఉబుద్ బాలిలో గల ‘మంకీ ఫారెస్ట్’ను సందర్శించింది.అక్కడ దిగిన కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది. మంకీల తో సెల్ఫీలు దిగుతూ వాటితో కలిసి ఎంతగానో అల్లరి చేస్తూ కనిపించింది. అలాగే పూర్తి చిరు నవ్వుతో చాలా ఆనందంగా కనిపించింది.. దీంతో ఇంత హ్యాపీగా వున్న సమంతను చూసి అభిమానులు ఎంతో ఆనంద పడుతున్నారు.. సమంత ఇలా ఎప్పటికప్పుడు తన హాలీడే ట్రిప్ కు సంబంధించిన అప్డేట్స్ ను అందిస్తూ వస్తుంది..ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట బాగా వైరల్ గా మారాయి. నెటిజన్లు ఈ పిక్స్ కీ లైక్స్ మరియు కామెంట్స్ కూడా చేస్తున్నారు.