Samantha: త్రీడీలో ‘శాకుంతలం’… త్వరలో కొత్త రిలీజ్ డేట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లార్జర్ దేన్ లైఫ్ చిత్రాలను రూపొందించే ఎపిక్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్. ఆయన ఆవిష్కరిస్తోన్న ప్రణయ దృశ్య కావ్యం ‘శాకుంతలం’. మహాభారత ఇతిహాసంలో అద్భుతమైన ప్రేమ ఘట్టంగా చెప్పుకుంటూ ప్రపంచం నలుమూలలున్న పండితుల ప్రశంసలు పొందింది సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం. దీన్ని ఆధారంగా చేసుకుని, ‘శాకుతలం’ చిత్రాన్ని గుణ శేఖర్ తెరకెక్కిస్తున్నారు. శకుంతల, దుష్యంత మహారాజు మధ్య ఉన్న అజరామరమైన ప్రేమగాథ ఇది. శకుంతలగా సమంత, దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించారు.
ఈ చిత్రాన్నిప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున నవంబర్ 4న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇలాంటి దృశ్య కావ్యాన్ని చూస్తున్నప్పుడు ప్రేక్షకుడు మధురమైన అనుభూతికి లోను కావాలి, ఆ అనుభూతులను తనలో భద్రపరుచుకోవాలనే తలంపుతో ఎపిక్ మేకర్ గుణ శేఖర్ ఇప్పుడీ సినిమాఉ త్రీడీలో అందించే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read
- Lovely Professional University: క్యాంపస్‌లో చెలరేగిన హింస.. 10 రోజుల పాటు క్లాసులు బంద్, మిడ్‌టర్మ్ పరీక్షలు వాయిదా!
- Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
- Vijayawada CI Ali Death Case: సీఐ అలీ మృతి కేసులో కీలక పరిణామం.. కానిస్టేబుల్ ఫిర్యాదుతో..!
- Bhagat Singh: నేటికీ భారత యువత నరనరాల్లో ప్రవహిస్తున్న విప్లవాగ్ని భగత్.. ఉరితాడును ముద్దాడిన వీరుడి కథ..
”అత్యంత భారీ స్థాయిలో, అత్యద్భుతంగా ‘శాకుంతం’ చిత్రాన్ని మీకు పరిచయం చేయాలన్నదే మా లక్ష్యం. అందుకే, ఇంతకు ముందు ప్రకటించిన సమయానికి మిమ్మల్ని థియేటర్లలో కలుసుకోలేకపోతున్నాం. ఇప్పటిదాకా అడుగడుగునా మమ్మల్ని ఆదరించిన అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు. మా ఈ ప్రయత్నాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీరందరూ ఆదరిస్తారని నమ్ముతున్నాం. సరికొత్త విడుదల తేదీతో త్వరలో మిమ్మల్ని కలుసుకుంటాం” అని చిత్ర యూనిట్ తెలియజేసింది.
సచిన్ ఖేడేకర్, కబీర్ బేడీ, డా. ఎం.మోహన్ బాబు, ప్రకాశ్ రాజ్, మధుబాల, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల, జిస్సు సేన్ గుప్తా ఇందులో ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ యువరాజు భరతుడి పాత్రలో నటించటం ప్రధాన ఆకర్షణ కానుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గుణ టీమ్ వర్క్స్ పతాకాలపై నీలిమ గుణ నిర్మాతగా ఈ సినిమా రూపొందుతోంది.
తాజావార్తలు
-
Lovely Professional University: క్యాంపస్‌లో చెలరేగిన హింస.. 10 రోజుల పాటు క్లాసులు బంద్, మిడ్‌టర్మ్ పరీక్షలు వాయిదా!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Vijayawada CI Ali Death Case: సీఐ అలీ మృతి కేసులో కీలక పరిణామం.. కానిస్టేబుల్ ఫిర్యాదుతో..!
-
Bhagat Singh: నేటికీ భారత యువత నరనరాల్లో ప్రవహిస్తున్న విప్లవాగ్ని భగత్.. ఉరితాడును ముద్దాడిన వీరుడి కథ..
-
RBI Bank Holidays October 2026: అక్టోబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు.. దసరా, దుర్గాపూజ సెలవుల పూర్తి జాబితా
ట్రెండింగ్
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!