స్టార్ హీరోయిన్ సమంత,అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లిని వారి కుటుంబాలతో పాటు టాలీవుడ్ ఫ్యాన్స్ కూడా ఎంతగానో సెలబ్రేట్ చేసుకున్నారు.వీరి జంట ఎంతో క్యూట్ గా వుంది అంటూ ఫ్యాన్స్ మురిసిపోయారు. కానీ పెళ్లయిన నాలుగేళ్లకే ఈ జంట విడిపోతున్నట్టుగా ప్రకటించి అందరికి షాక్ ఇచ్చింది.దీంతో ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా షాక్ అయి అసలు వారు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అని ఇప్పటికీ కూడా చర్చించుకుంటున్నారు. తాజాగా నాగచైతన్య తో విడిపోవడంపై సమంత మరోసారి పరోక్షంగా వ్యాఖ్యలు చేసింది. విడాకుల గురించి ప్రకటించిన తర్వాత తన జీవితం ఎంత కష్టంగా సాగిందో చెప్పుకొచ్చింది.. తాజాగా అనారోగ్య సమస్యల గురించి అందరికీ అవగాహన కల్పించే ఒక పాడ్ కాస్ట్ ప్రారంభించింది. అందులో తన పర్సనల్ లైఫ్ విషయాలను కూడా షేర్ చేసుకుంటోంది.
తాజాగా నాగచైతన్య తో విడాకులపై స్పందించింది సామ్. ‘‘నాకు బాగా గుర్తుంది. నాకు ఈ సమస్య రావడానికి సరిగ్గా ఏడాది ముందు నాకు ఎంతో కష్టం గా గడిచింది. నేను నా మ్యానేజర్ హిమాంక్ తో ముంబాయ్ నుండి ప్రయాణిస్తున్న సమయం లో నాకు చాలా ప్రశాంతం గా అనిపిస్తుందని తనతో చెప్పాను. చాలాకాలంగా నేను ఇంత ప్రశాంతంగా లేనని కూడా అన్నాను. ఫైనల్ గా నేను ప్రశాంతంగా ఊపిరి తీసుకోగలుగుతున్నాను, తృప్తిగా నిద్రపోగలుగుతున్నాను, లేచి నా పనిపైన దృష్టి పెట్టగలుగుతున్నాను అని అనిపించే లోపు నాకు ఈ కండీషన్ ఉందని తెలిసింది’’ అంటూ సమంత రివీల్ చేసింది. అయితే, ఏడాది కిందట సమంత నాగ చైతన్య విడాకులు ప్రకటించారు. దీంతో దాన్ని ఉద్దేశించే సామ్ కష్టంగా గడిచిందని చెప్పి ఉండవచ్చని అందరూ భావిస్తున్నారు