సమంత.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. నటిగా అనతి కాలంలోనే తిరుగులేని గుర్తింపు సంపాదించుకుంది. భాషతో సంబంధం లేకుండా దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టింది. ఇక కెరీర్ మంచి పిక్స్ లో ఉండగా సామ్ జీవితం తలక్రిందులుగా మారింది. గత రెండేళ్లలో ఆమె జీవితంలో ఊహించలేని సంఘటనలు ఎదురయ్యాయి. కానీ ఎంతటి కష్టాని అయిన చిరునవ్వుతో జయించగల దృఢ సంకల్పం సమంత లో ఉందని చెప్పావచ్చు.
‘మయోసైటిస్’ అనే ఆటో ఇమ్యూన్ డిసీజ్ నుంచి కోలుకున్న సామ్. తిరిగి కెరీర్ స్టార్ట్ చేసింది కానీ ఇంతలోనే తను ఎంతగానో ప్రేమించే తన తండ్రిని కోల్పోయింది. ఇలా తన జీవితంలో కోలుకుంటున్న సమయంలో ఏదో ఒక సమస్య చుట్టు ముడుతుంది. కానీ ధైర్యం మాత్రం కోల్పోలేదు ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా తన అభిమానులో స్ఫూర్తి నింపే మాటలతో, రకరకాల వర్కవుట్లు చేస్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది సమంత.
‘ఈ కొత్త సంవత్సరం మీరు తీసుకున్న నిర్ణయాలు, అనుకున్న లక్ష్యాలను సాధించడంలో వెనకబడ్డారా..? ప్రస్తుతం నేను కూడా ఇదే పరిస్థితి లో ఉన్నాను. కాకపోతే నాకిలా చాలాసార్లు జరిగింది. కానీ కొన్ని గడ్డు రోజులు చవిచూసి నంత మాత్రాన మనం ఓడిపోయినట్టు కాదు. కొన్నిసార్లు కావాలని మనమే విరామం తీసుకుంటాం. కొన్ని సందర్భాల్లో మనల్ని మనమే ప్రోత్సహించు కుంటూ ముందుకు వెళ్ళాలి. ఒకవేళ తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండలేకపోతున్నారా? పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంతకు ముందులా కాకుండా ఈ సంవత్సరం నేను కొత్తగా, ప్రత్యేకంగా ఒకటి చేయబోతున్న. నాకు చక్కగా సరిపోయిన, నాకెంతో ఉపయోగపడిన ఫిట్నెస్ పద్ధతుల్ని, విషయాల్ని మీకు వివరిస్తాను. మీకు కూడా అవి అద్భుతంగా పనికొస్తాయని నమ్ముతున్నా. మనందరం కలిసి ఇవన్నీ చేద్దాం. ఒత్తిడికి లోనవ్వాల్సిన అవసరం లేదు. ఆలోచన పక్కన పెట్టి. అన్ని రకాల వర్కవుట్లు ఒకే సారి కాకుండా ఒక్కొక్కటి.. నిదానంగా చేసుకుంటూ పోదాం. అప్పుడు మనం అనుకున్న ఫలితాలను రాబట్టగలం’ అంటూ చెప్పుకొచ్చింది ఈ సామ్. ప్రజంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.