Samantha-Naga Chaitanya : ఒకే వేడుకలో సమంత – నాగచైతన్య.. అది కూడా పార్ట్‌నర్స్‌తో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె సిమ్రన్ వివాహ రిసెప్షన్ శనివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నాగార్జున, రవితేజ వంటి సినీ దిగ్గజాలతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే, ఈ వేడుకలో అందరి కళ్ళు నాగచైతన్య సమంతలపైనే నిలిచాయి. విడాకుల తర్వాత వీరిద్దరూ కలిసి ఏ సినిమా ఈవెంట్‌లో కానీ, కుటుంబ వేడుకలో కానీ పాల్గొనలేదు. కానీ ఈ రిసెప్షన్‌లో ఇద్దరూ తమ భాగస్వాములతో కలిసి కనిపించడం విశేషం.
నాగచైతన్య తన భార్య శోభిత ధూళిపాళ, తల్లిదండ్రులు నాగార్జున-అమలతో కలిసి ఈ వేడుకకు విచ్చేశారు. ఆ కొద్దిసేపటికే సమంత కూడా తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి రిసెప్షన్‌కు రావడంతో మీడియా కెమెరాలన్నీ అటే మళ్లాయి. వివాదాలు, విడాకుల తర్వాత ఇద్దరూ రెండో పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. తమ బంధానికి గుర్తుగా వేయించుకున్న టాటూలను తొలగించుకునే ప్రయత్నం చేసినప్పటికీ, సమంత తన మెడపై ఉన్న ‘YMC’ (ఏమాయ చేశావే) టాటూను మాత్రం అలాగే ఉంచుకోవడం గమనార్హం.
Also Read
- Perni Nani: స్పోర్ట్స్ కోటానే కాదు.. వికలాంగులు, ఓసీ, బీసీ కోటాల్లోనూ అక్రమాలు.. డీఎస్సీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
- India vs Afghanistan T20: వాషింగ్టన్, నితీష్ ఎంపికపై మాజీ క్రికెటర్ అసంతృప్తి.. గంభీర్‌పై పరోక్ష విమర్శలు
- Liquor Prices: మద్యం బాటిళ్లపై అదనపు వసూళ్లు.. సీఎం సీరియస్.. 3 రోజుల్లో 240 మందిపై వేటు..
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ వల్లే నా భార్య దులీప్ ట్రోఫీ చూసింది’.. శ్రీకాంత్ కామెంట్స్ వైరల్
తమ కెరీర్‌కు, ప్రేమ బంధానికి పునాది వేసిన ‘ఏమాయ చేశావే’ సినిమాపై గౌరవంతోనే సమంత ఆ టాటూను ఉంచుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నో గొడవల తర్వాత విడిపోయి, ప్రస్తుతం వేర్వేరు జీవితాల్లో స్థిరపడిన ఈ ఇద్దరూ ఒకే వేదికపై కనిపించడం చిత్ర పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీసింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: “రెండేళ్లు సమయం ఇవ్వండి.. మీ సమస్యలు పరిష్కరిస్తా”.. ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ
-
Toxic English Version: యష్ ‘టాక్సిక్’కు మరో షాక్.. ఇంగ్లీష్ వెర్షన్‌కు సౌండ్ నిల్..
-
Perni Nani: స్పోర్ట్స్ కోటానే కాదు.. వికలాంగులు, ఓసీ, బీసీ కోటాల్లోనూ అక్రమాలు.. డీఎస్సీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
-
Nepal Flash Floods: నేపాల్‌ను వెంటాడుతున్న ప్రకృతి విపత్తు.. దార్చులాలో విరిగిపడిన కొండచరియలు
-
India vs Afghanistan T20: వాషింగ్టన్, నితీష్ ఎంపికపై మాజీ క్రికెటర్ అసంతృప్తి.. గంభీర్‌పై పరోక్ష విమర్శలు
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!