సమంత.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేస్తుంది.. అంతేకాదు ట్రెండ్ కు తగ్గట్లు అదిరిపోయే డ్రెస్సులు వేస్తూ ఫోటోలకు పోజులు ఇస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది..ఈ మధ్య ఎక్కువ పొట్టి పొట్టి బట్టలలో దర్శనమిస్తుంది.. ట్రెడిషినల్ లుక్ లో కనిపించి అందరి మనసు దోచుకుంది.. తాజాగా స్కిన్ కలర్ కాజ్వల్ శారీ ధరించింది. పూల శారీలో కట్టి ఫోటోలకు పోజులిచ్చింది. ఈ సందర్భంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఓ శారీ ఫోటో ఆద్యంతం కట్టిపడేస్తుంది..ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి..
తన బ్రాండ్ ను ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే..ఇది విజయవంతంగా రన్ అవుతుంది. అయితే దీన్ని సమంతనే సొంతంగా బ్రాండ్ అంబాసిడర్‌లా వ్యవహరిస్తుంది. తనే మోడల్‌గా ప్రమోట్ చేస్తుంది.. ఇక తాను వేసుకొనే ప్రతి డ్రెస్సు కూడా తన ఓన్ బ్రాండ్ దుస్తులే.. సమంత `సాకి` దుస్తులతోపాటు `ఏకం` పేరుతో ఎర్లీ లెర్నింగ్ స్కూల్‌ని కూడా నడిపిస్తుంది. మరోవైపు ప్రత్యుష పేరుతో ఓ ఎన్జీవోని రన్ చేస్తుంది సమంత. ఇలా ఓ వైపు సినిమాలతోపాటు వ్యాపారాల్లోనూ దూసుకుపోతుంది. మరోవైపు కమర్షియల్ యాడ్స్ చేస్తూ నాలుగు దారుల్లోనూ సంపాదిస్తుంది.. ప్రస్తుతం గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, యాడ్స్ చేస్తూ బాగానే వెనకేసుకుంటుంది..
ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో బిజీగాఉంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో `ఖుషి` సినిమాలో నటిస్తుంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా, ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా రూపొందుతుంది. దీంతోపాటు `సిటాడెల్` అనే వెబ్ సిరీస్‌లోనూ నటిస్తుంది. మరోవైపు హిందీలో ఒకటి రెండు సినిమాలకు కమిట్ అయ్యిందని సమాచారం.. ఇక యాడ్స్ కూడా చేస్తుంది..అలాగే ఓ అంతర్జాతీయ మూవీ కూడా చేస్తుంది సామ్..నటిగా సమంత ఇప్పుడు కెరీర్ పరంగా పీక్‌లో ఉంది. ఆమె స్టార్ హీరోలకు దీటుగా ఇమేజ్‌ని సొంతం చేసుకుంది… సమంత బాలివుడ్ చేస్తున్న మొదటి సినిమాకే భారీగా చార్జ్ చేస్తుందని టాక్..