NTV Telugu Site icon

Samantha Instagram Story: మరో మూడు రోజులు మాత్రమే.. సమంత ఇన్‌స్టా స్టోరీ వైరల్!

Samantha Saree

Samantha Saree

Samantha hinted take a break from movies for 6 months: గత కొన్ని రోజులుగా స్టార్‌ హీరోయిన్‌ సమంతకు సంబదించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఓ ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇస్తున్నారని ప్రనెట్టింట చారం జరుగుతోంది. మయోసైటిస్‌ చికిత్స కోసం వచ్చే కొన్ని నెలల సమయంను కేటాయించడానికి సినిమాలకు విరామం ఇవ్వనున్నట్లు టాక్. ఈ విషయంపై ఇప్పటివరకు సామ్ స్పందించలేదు. అయితే తాజాగా సమంత ఇన్‌స్టా స్టోరీ చూస్తే అదే నిజం అని అనిపిస్తోంది.

తాజాగా సమంత తన ఇన్‌స్టా స్టోరీలో కారవాన్‌ ఫొటో పెట్టారు. ‘మరో మూడు రోజులు మాత్రమే ఈ కారవాన్‌లో ఉండేది’ అని ఫొటోపై రాసుకొచ్చారు. అంతేకాదు తన ఫొటో ఒకటి పెట్టి.. ‘6 నెలలు కష్టంగా గడపడానికి సిద్ధపడాలి. ఎలాగైనా దీనికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చింది’ అని పేర్కొన్నారు. దాంతో సమంత సినిమాలకు కొన్ని నెలలు విరామం ఇవ్వాలని నిర్ణయించుకున్నారని స్పష్టంగా అర్ధవవుతోంది. సమంత ఇన్‌స్టా స్టోరీ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

‘ఖుషి’ షూటింగ్‌ అయ్యాక సమంత మయోసైటిస్‌ చికిత్స కోసం అమెరికా వెళ్లనున్నట్లు సమాచారం తెలుస్తోంది. సామ్ పోస్ట్‌ చూసి అభిమానులు త్వరగా కోలుకుని.. మళ్లీ సినిమాల్లో నటించాలని కామెంట్స్‌ పెడుతున్నారు. ప్రస్తుతం విజయ్‌ దేవకొండ సరసన సమంత ఖుషి సినిమాలో నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. సమంత చేతిలో ఉన్న ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ షూటింగ్ కూడా పూర్తయింది. ప్రస్తుతం సామ్ కొత్త సినిమాలు ఒప్పుకోలేదు. ఇక వచ్చే ఏడాదే సమంత తిరిగి సినిమాలపై దృష్టి పెట్టనున్నారని సమాచారం.

Also Read: IND vs PAK: పాకిస్థాన్‌తో మ్యాచ్‌లు అంటే భారత్‌కు భయం: అబ్దుల్ రజాక్

Also Read: World Cup 2023: ప్రపంచకప్ 2023 సెమీస్ చేరే జట్లు ఇవే.. ఐదవ టీమ్ పాకిస్థాన్!

Samantha Ista

Sam Insta

Show comments