Samantha: 2010లో ‘ఏ మాయ చేశావే’ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన సమంత రూత్ ప్రభు, అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఓ బేబీ, శాకుంతలం, యశోద, మజిలీ వంటి చిత్రాలతో తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఫిట్నెస్, ఆత్మవిశ్వాసం, నటనతో పాటు సోషల్ మాధ్యమాల్లోనూ సమంతకు మంచి ఫాలోయింగ్ ఉంది. వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఆమె దృఢంగా ముందుకెళ్తూ తెలుగు ప్రేక్షకులతో పటు దక్షిణాది సినీ అభిమానుల మనసుల్లో తన స్థానం నిలబెట్టుకుంది.
Read Also:Nara Lokesh: ప్రభుత్వ విద్యకు బ్రాండ్ అంబాసిడర్స్.. మా’స్టార్స్’.. మీకు హేట్సాఫ్
తాజాగా అమెరికాలో ఘనంగా ముగిసిన తానా 24వ మహాసభలు మూడు రోజులు పాటు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తానా వేదికపై మాట్లాడిన సమంత.. తన భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ వేదికపై నిలబడే అవకాశం రావడం తన జీవితంలో ఒక గొప్ప సంఘటనగా భావిస్తున్నానని చెప్పారు. ఈ వేదికపై నిలబడటానికి నాకు 15 సంవత్సరాలు పట్టింది. ప్రతి సంవత్సరం తానా గురించి వింటూనే ఉన్న. కానీ, ఇక్కడకు వచ్చి మీరు చూపిన ప్రేమకు ధన్యవాదాలు చెప్పడం ఈరోజే సాధ్యమైందంటూ ఆమె పేర్కొన్నారు. ‘ఏ మాయ చేశావే’ సినిమాతోనే మీరు నన్ను మీ కుటుంబ సభ్యురాలిగా అంగీకరించారు. అప్పటి నుంచే మీరు నాకు నిరంతరంగా ప్రేమను, మద్దతును ఇస్తున్నారు అంటూ మాట్లాడింది.
Read Also:ENG vs IND: సరేలే ఎన్నో అనుకుంటాం.. హ్యారీ బ్రూక్‌కు గిల్ స్ట్రాంగ్ కౌంటర్!
తాను తీసుకునే ప్రతి నిర్ణయానికి ముందు తెలుగు ప్రజలు ఏమనుకుంటారు? అనే ఆలోచన మొదట వస్తుందని చెప్పింది. మీరు నాకు ఒక గుర్తింపునిచ్చారు. మీరు నాకు దూరంగా ఉన్నా, నా హృదయంలో ఎప్పుడూ ఉంటారు. ‘ఓ బేబీ’ సినిమా అమెరికాలో మిలియన్ డాలర్లు సంపాదించానని గుర్తు చేసింది. అది నిజమైందన్న నమ్మకం నాకు మొదట రాలేదని తెలిపారు. ఈ మాటలు చెబుతుంటే ఆమె కంట కన్నీళ్లు వచ్చాయి. ఈ భావోద్వేగభరిత ప్రసంగానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు నన్ను ఎప్పుడూ నాకు కనిపించే దారి మీద నడిపించారు… మీకు కృతజ్ఞురాలిని అంటూ తానా వేదికపై ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి.