Pushpa 2: దేవిశ్రీకి షాక్.. ‘గంగమ్మ జాతర’ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే?
- గ్రౌండ్ స్కోర్ కోసం ముగ్గురు
- నిర్మాతలపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం
- గంగమ్మ జాతరకు వర్క్ చేస్తున్నట్టు సామ్ సీఎస్ పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘పుష్ప 2’ షూటింగ్ మొదలైనప్పటి నుంచి వినిపిస్తున్న ఒకే ఒక్క మాట ‘గంగమ్మ జాతర’. సినిమాలో ఈ సీక్వెన్స్‌కు థియేటర్లు తగలబడిపోయిన ఆశ్చర్యపోనక్కర్లేదనే హైప్ ఉంది. బన్నీ అమ్మవారి గెటప్‌కు పూనకాలు వస్తాయని చిత్ర యూనిట్ చెబుతుండగా.. టీజర్, ట్రైలర్లో ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన షాట్స్ హైలెట్‌గా నిలిచాయి. దీంతో డిసెంబర్ 5 కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం మరో ముగ్గురిని రంగంలోకి దింపారు మేకర్స్. ఈ విషయంలో దేవి నిర్మాతలపై అసహనంగా ఉన్నట్టుగా చెన్నై ఈవెంట్‌తో తెలిసింది.
ఎస్ఎస్ తమన్, అజనీష్ లోకనాథ్, సామ్ సీఎస్‌లకు ఒక్కో ఎపిసోడ్ ఇచ్చి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొట్టిస్తున్నారు. ఇప్పటికే తమన్ పుష్ప 2లో తాను కూడా ఓక భాగం అని చెప్పగా.. తాజాగా సామ్ సీఎస్ కూడా క్లారిటీ ఇచ్చేశాడు. తాను పుష్ప 2కి వర్క్ చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. అది కూడా కీలక ఎపిసోడ్ గంగమ్మ జాతరకు వర్క్ చేస్తున్నట్టుగా.. బన్నీ జాతర సీక్వెన్స్ గెటప్‌ని పోస్ట్ చేశాడు. మామూలుగా అయితే.. దేవిశ్రీనే ఈ ఎపిసోడ్‌కి మ్యూజిక్ అందిస్తారని అంతా భావించారు. కానీ ఇప్పుడు ఈ కీలక ఎపిసోడ్‌కి సామ్ సీఎస్ బ్యా క్ గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్నట్టుగా క్లారిటీ వచ్చేసింది. ఇది దేవితో పాటు ఆయన అభిమానులకు షాకింగ్ అనే చెప్పాలి.
Also Read
- Amit Shah: మధ్యాహ్నం 3 గంటలకు రెడీగా ఉండండి.. విపక్షాలకు అమిత్ షా సవాల్
- AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
- CM Vijay: ఆ స్థానాలే కొనసాగించాలి.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో విజయ్ తీర్మానం
- N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి 'చంద్రశేఖరన్' రాజీనామా?
Also Read: Sreeleela: శ్రీలీలకు బంపరాఫర్.. సూపర్ హిట్ హీరోతో ఛాన్స్?
రీసెంట్గా కిరణ్ అబ్బవరం ‘క’ సినిమాకు సామ్ సీఎస్ సూపర్ స్కోర్ ఇచ్చాడు. అదిరిపోయే జాతర సాంగ్‌కు కూడా ఇచ్చాడు. దీంతో ఇప్పుడు పుష్ప 2లో కూడా మాస్ జాతర ఎపిసోడ్‌ను సామ్ సీఎస్‌కు ఇచ్చినట్టుగా చెప్పొచ్చు. ఏదేమైనా సరే సాలిడ్ అవుట్ పుట్ కోసం ట్రై చేస్తున్న సుకుమార్.. పుష్ప 2 కోసం ఏకంగా నలుగురు సంగీత దర్శకులతో పని చేస్తున్నాడు. అయితే తమన్, అజనీష్.. ఏ సీక్వెన్స్‌కు వర్క్ చేస్తున్నారనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Amit Shah: మధ్యాహ్నం 3 గంటలకు రెడీగా ఉండండి.. విపక్షాలకు అమిత్ షా సవాల్
-
Samuk: ఏలియన్ సినిమాకు సిద్ధమవుతున్న అక్షయ్ .. 90% షూటింగ్ లండన్‌లో…
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
CM Vijay: ఆ స్థానాలే కొనసాగించాలి.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో విజయ్ తీర్మానం
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
ట్రెండింగ్
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?