NTV Telugu Site icon

Salaar Teaser: సలార్‌ పార్ట్‌-1.. ‘సీజ్‌ఫైర్‌’ అంటే ఏంటో తెలుసా?

Ceasefire Meaning

Ceasefire Meaning

Do You Know What Is Ceasefire: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ కథానాయకుడిగా కేజీయఫ్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సలార్‌’. పృథ్వీరాజ్‌ సుకుమార్‌, శ్రుతి హాసన్‌, జగపతి బాబు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రభాస్‌ ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సలార్‌ టీజర్‌ ఈరోజు ఉదయం రిలీజ్ అయి.. సోషల్ మీడియాను షేక్‌ చేస్తోంది. 1 నిమిషం 46 సెకన్ల పాటు సాగిన పవర్‌ఫుల్‌ యాక్షన్‌ టీజర్‌తో సలార్‌ సినిమాపై దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ అంచనాలను పెంచేశారు.

‘వైలెన్స్‌.. వైలెన్స్‌.. వైలెన్స్‌’ అనే ఒక్క డైలాగ్‌తో కేజీయఫ్‌-2 ట్రైలర్‌ విడుదల చేసి అంచనాలు పెంచిన డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌.. సలార్‌ విషయంలోనూ అదే ఫాలో అయ్యాడు. ఒకే ఒక్క ఇంగ్లీష్‌ డైలాగ్‌తో సినిమా ఎలా ఉండబోతోందో చెప్పేశారు. ‘సింహం, చిరుత, పులి, ఏనుగు చాలా ప్రమాదకరం కానీ.. జురాసిక్‌ పార్క్‌లో కాదు. ఎందుకంటే అక్కడ..’ అంటూ ప్రభాస్‌ను ఎలివేట్‌ చేశారు. అయితే టీజర్‌లో ప్రభాస్ ఫేస్ కూడా క్లియర్‌గా కనిపించకపోవడం, ఎలాంటి డైలాగ్స్‌ లేకపోవడంతో అభిమానులకు మింగుడుపడడం లేదు.

సలార్‌ సినిమా రెండు భాగాలుగా రానుందని టీజర్‌ ద్వారా స్పష్టత వచ్చింది. ‘సలార్‌ పార్ట్‌-1: సీజ్‌ ఫైర్‌’ (Salaar Part 1: Ceasefire) అని టీజర్‌లో పేర్కొన్నారు. ఈ సీజ్‌ ఫైర్‌ ఏంటి (Ceasefire Meaning) అని అందరూ గూగుల్‌లో వెతుకుతున్నారు. సీజ్‌ ఫైర్‌ అంటే.. కాల్పుల విరమణ లేదా యుద్ధాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం. రెండు దేశాల మధ్య యుద్ద సమయంలో తీవ్ర కాల్పులు జరిగినప్పుడు లేదా అత్యంత హింసాత్మకక ఘటనలు జరిగిన సమయంలో శాంతి కోసం ఒప్పందాన్ని కుదుర్చకోవడాన్నే ‘సీజ్‌ ఫైర్‌’ అంటారు. మరి సినిమాలో ప్రభాస్‌ సీజ్‌ ఫైర్‌ ఎలా ఉంటుందో చూడాలి.

Also Read: Tomatoes stolen: కర్ణాటకలో టమాటాల దొంగతనం.. కేసు నమోదు..

Also Read: IND vs WI: మూడు ఫార్మాట్‌లలో దక్కిన చోటు.. భవిష్యత్ స్టార్స్ ఈ నలుగురేనా!