Salaar Teaser: సలార్ పార్ట్-1.. ‘సీజ్‌ఫైర్’ అంటే ఏంటో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Do You Know What Is Ceasefire: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా కేజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సలార్’. పృథ్వీరాజ్ సుకుమార్, శ్రుతి హాసన్, జగపతి బాబు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రభాస్ ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సలార్ టీజర్ ఈరోజు ఉదయం రిలీజ్ అయి.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 1 నిమిషం 46 సెకన్ల పాటు సాగిన పవర్‌ఫుల్ యాక్షన్ టీజర్‌తో సలార్ సినిమాపై దర్శకుడు ప్రశాంత్ నీల్ అంచనాలను పెంచేశారు.
‘వైలెన్స్.. వైలెన్స్.. వైలెన్స్’ అనే ఒక్క డైలాగ్‌తో కేజీయఫ్-2 ట్రైలర్ విడుదల చేసి అంచనాలు పెంచిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. సలార్ విషయంలోనూ అదే ఫాలో అయ్యాడు. ఒకే ఒక్క ఇంగ్లీష్ డైలాగ్‌తో సినిమా ఎలా ఉండబోతోందో చెప్పేశారు. ‘సింహం, చిరుత, పులి, ఏనుగు చాలా ప్రమాదకరం కానీ.. జురాసిక్ పార్క్‌లో కాదు. ఎందుకంటే అక్కడ..’ అంటూ ప్రభాస్‌ను ఎలివేట్ చేశారు. అయితే టీజర్‌లో ప్రభాస్ ఫేస్ కూడా క్లియర్‌గా కనిపించకపోవడం, ఎలాంటి డైలాగ్స్ లేకపోవడంతో అభిమానులకు మింగుడుపడడం లేదు.
Also Read
సలార్ సినిమా రెండు భాగాలుగా రానుందని టీజర్ ద్వారా స్పష్టత వచ్చింది. ‘సలార్ పార్ట్-1: సీజ్ ఫైర్’ (Salaar Part 1: Ceasefire) అని టీజర్‌లో పేర్కొన్నారు. ఈ సీజ్ ఫైర్ ఏంటి (Ceasefire Meaning) అని అందరూ గూగుల్‌లో వెతుకుతున్నారు. సీజ్ ఫైర్ అంటే.. కాల్పుల విరమణ లేదా యుద్ధాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం. రెండు దేశాల మధ్య యుద్ద సమయంలో తీవ్ర కాల్పులు జరిగినప్పుడు లేదా అత్యంత హింసాత్మకక ఘటనలు జరిగిన సమయంలో శాంతి కోసం ఒప్పందాన్ని కుదుర్చకోవడాన్నే ‘సీజ్ ఫైర్’ అంటారు. మరి సినిమాలో ప్రభాస్ సీజ్ ఫైర్ ఎలా ఉంటుందో చూడాలి.
Also Read: Tomatoes stolen: కర్ణాటకలో టమాటాల దొంగతనం.. కేసు నమోదు..
Also Read: IND vs WI: మూడు ఫార్మాట్‌లలో దక్కిన చోటు.. భవిష్యత్ స్టార్స్ ఈ నలుగురేనా!
తాజావార్తలు
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!