Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు, లోకేష్ తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని.. చంద్రబాబు మాటలు పగటి కలల్లా ఉంటాయని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడే.. కానీ ఇంత అనుభవం ఉన్న చంద్రబాబు మేనిఫెస్టో విషయంలో జగన్ పొగిడారు అని తనకు తానే అనుకోవడం విచిత్రంగా ఉందన్నారు. లోకేష్‌ది చిల్లర వ్యవహారమన్న సజ్జల.. చవకబారుగా వివేకా అంశంపై ప్లకార్డులు ప్రదర్శిస్తున్నాడన్నారు. కింది స్థాయి కార్యకర్తలు చేస్తే అర్థం చేసుకోవచ్చని.. గర్భంలో ఉన్నప్పుడే మానసిక వైకల్యం వచ్చి ఉంటుందని మండిపడ్డారు. బీజేపీతో కలవటానికి చంద్రబాబు వెంపర్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. జగన్ ఢిల్లీ వెళితే తాటాకులు కడతారని… మరిప్పుడు చంద్రబాబు గురించి ఏం మాట్లాడతారని ప్రశ్నించారు.
Read Also: Naatu Naatu Song: నాటు నాటు సాంగ్‌పై సైనికుల డ్యాన్స్.. ఎక్కడంటే..
పవన్ కళ్యాణ్‌ను తిరగవద్దని ఎవరూ అనలేదని.. ప్రజల్లో తిరగమనే చెబుతున్నామన్నారు. ఇప్పుడు కూడా ఎంత వరకు తిరుగుతాడో నమ్మకం లేదన్నారు. తన కొడుకుకు అడ్డం వస్తాడని చంద్రబాబు ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ యాత్రను ఆపినట్లు ఉన్నాడని ఆయన ఆరోపణలు చేశారు. ఒక కులాన్ని నమ్ముకుని రాజకీయాల్లోకి రావాలనుకుంటే ప్రజలు అంగీకరించరని.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ అందరూ గెస్ట్ ఆర్టిస్టులేనని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
