Site icon NTV Telugu

Sajjala Ramakrishna Reddy: మేమంతా మౌనంగా ఉన్నాం.. అనవసరంగా వివాదాలు సృష్టించొద్దు..!

Sajjala

Sajjala

Sajjala Ramakrishna Reddy: మేమంతా మౌనంగా ఉన్నాం.. అనవసరంగా వివాదాలు సృష్టించొద్దు.. మేం దణ్ణం పెట్టి చెబుతున్నాం.. హత్యలు, దాడులకు దూరంగా ఉండాలి అని విజ్ఞప్తి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. మీ దాడులకు మా రియక్షన్ వేరేలా ఉంటే టీడీపీ నేతలు తట్టుకోలేరు అని హెచ్చరించారు.. తాడేపల్లిలో మేకా వెంకటరెడ్డి ఇంటిని సందర్శించి.. వెంకటరెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీడీపీ హింసాత్మక చర్యలకు ఉపక్రమించింది. మనుషుల ప్రాణాలు తీసేనేదుకు సైతం వెనకాడటం లేదు. టీడీపీ గూండాలు మా వాళ్లని రెచ్చగొట్టి మరి బైక్ తో వచ్చి వేగంగా ఢీ కొట్టారు. ప్రాణాలు తియ్యాలన్న ఉద్దేశంతో ఈ రకంగా దాడులకు దిగుతున్నారు. మేం సంయమనంతో, నిగ్రహంతో ఉన్నా టీడీపీ నేతలు కావాలని రెచ్చగొడుతున్నారని ఫైర్‌ అయ్యారు.

Read Also: Suspended: టీఐఎస్ఎస్ దళిత పీహెచ్‌డీ విద్యార్థిపై రెండేళ్ల పాటు వేటు.. కారణమిదే!

మేం కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుంది అని హెచ్చరించారు సజ్జల.. దాడులు వాళ్లే చేస్తున్నారు.. బాధితులు వాళ్లే అని మళ్లీ ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేస్తున్నారు. మా వాళ్లు నిగ్రహంతో ఉన్నారు.. కాబట్టే టీడీపీ నేతలు ఇంకా ఉన్నారని వార్నింగ్‌ ఇచ్చారు. శవాలపై పేలాలు ఎరుకోవాలని టీడీపీ చూస్తోందన్న ఆయన.. సీఎం వైఎస్‌ జగన్‌పై జరిగిన దాడి మర్చిపోక ముందే మరో హత్యకు పాల్పడ్డారని ఫైర్‌ అయ్యారు. మా మౌనాన్ని చేతకాని తనంగా తీసుకోవద్దని టీడీపీ నేతలకు చెప్తున్నాం. సిగ్గు లేకుండా జరిగిన దాడులను వెనకేసుకొచ్చి డ్రామా అని టీడీపీ నేతలు అంటున్నారు.. కానీ, రాష్ట్రానికి పట్టిన టీడీపీ పీడ 20 రోజుల్లో వదులుతుందన్నారు. మేం రెచ్చిపోతే అది ఎక్కడికో దారి తీస్తుందని టీడీపీని హెచ్చరించారు.. మేం అంతా మౌనంగా ఉన్నాం.. అనవసరంగా వివాదాలు సృష్టించవద్దు.. మేం దణ్ణం పెట్టి చెప్తున్నాం హత్యలు, దాడులకు దూరంగా ఉండాలన్నారు. మీ దాడులకు మా రియక్షన్ వేరేలా ఉంటే టీడీపీ నేతలు తట్టుకోలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే దాడులు చేయాలని టీడీపీ చూస్తోంది. వైసీపీ నేతలు అంతా సమయమనం కోల్పోవద్దని విజ్ఞప్తి చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.

Exit mobile version