Sajjala Ramakrishna Reddy: చిరంజీవిని నేను ఏమీ అనలేదు.. పవన్ కల్యాణ్,చంద్రబాబుకు సంస్కారం లేదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjala Ramakrishna Reddy: చిరంజీవిని ఉద్దేశించి నేను ఏమి అనలేదని స్పష్టం చేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి.. అయితే, చిరంజీవి మద్దతు ఇవ్వడం మంచిదే.. కానీ, ఇంకా ఎవ్వరూ కలిసి వచ్చినా ఇబ్బంది లేదు అని మాత్రమే చెప్పానన్నారు. చిరంజీవిని నేను విమర్శించా అని చెప్పడం ద్వారా కొంత మందిని అయిన దగ్గర చేసుకోవచ్చు అని మూడు పార్టీల నేతలు భావిస్తున్నారు అంటూ దుయ్యబట్టారు. చంద్రబాబును సీఎం చేయడం కోసం రకరకాల కుయుక్తులు పన్నుతున్నారు. 2014లో బీజేపీ, జనసేన, టీడీపీకి మద్దతు ఇచ్చాయి. అప్పుడు రాచి రంపాన పెట్టారు.. మళ్లీ ఇప్పుడు పొత్తు పెట్టుకొని వస్తున్నారని మండిపడ్డారు. వాంటెడ్ లేబర్ కంటే అన్యాయంగా బీజేపీ, జనసేన, టీడీపీకి సాగిల పడ్డాయన్న ఆయన.. ఆత్మాభిమానం వదిలేసి రెండు పార్టీలు టీడీపీతో జత కట్టాయని బీజేపీ, జనసేనపై విరుచుకుపడ్డారు. ఓడిపోతున్నాం అని తెలిసి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని విమర్శించారు.
ఇక, డ్వాక్రా మహిళల గురించి చంద్రబాబు మాట్లాడుతున్న మాటలు చూస్తూనే నవ్వొస్తుందన్నారు సజ్జల.. డ్వాక్రా మహిళలను మోసం చేసింది చంద్రబాబే.. రుణమాఫీలు చేస్తా అని మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదే.. అసలు పవన్ కల్యాణ్, చంద్రబాబుకు సంస్కారం లేదని మండిపడ్డారు. చంద్రబాబుకు కుటుంబ విలువలు తెలుసా..? అని ప్రశ్నించారు. చంద్రబాబు తమ్ముడు రాముర్తి నాయుడు ఎక్కడ ఉన్నాడు.? చంద్రబాబు చెల్లెళ్లు ఎక్కడ ఉన్నారు..? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటీసులను స్పందించకపోగా.. బెదిరింపు దొరనికి దిగుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు మాట్లాడిన మాటలు చదివి వినిపించాలని అనుకున్న సిగ్గేస్తుంది. ప్రభుత్వ విధానాలపై మాట్లాడకుండా నోటికి వచ్చిన తిట్లు తిడుతున్నారు. ఓటమి భయంతో నోటికి ఏదివస్తే అదే మాట్లాడుతున్నారన్నారు.
Also Read
- Renukaswamy Murder: నటుడు దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
- BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
- Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
- Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
తొందరలో మేనిఫెస్టో విడుదల చేస్తాం అని తెలిపారు సజ్జల.. మేం కుటుంబాల గురించి మాట్లాడితే చంద్రబాబు తలెత్తుకొని తిరగలేరని హెచ్చరించారు. ఎన్నికలు అంటే ఇచ్చిన హామీలు, చేసిన పనుల గురించి మాట్లాడాలి.. ఎన్నికలకు, కుటుంబాల గురించే మాట్లాడుకొని రెఫరెండం పెట్టుకొని వస్తాము అంటే మేం రెడీగా ఉన్నాం అని సవాల్ చేశారు. ఎన్నికల కమిషన్ స్వతంత్ర సంస్థ వాళ్లపని వాళ్లు చేస్తారు.. కక్ష సాధింపు చర్యలకు ఎన్నికల కమిషన్ పాల్పడుతుందని మేం భావించడం లేదన్నారు. అధికారుల బదిలీల గురించి మేం ఏమి మాట్లాడం.. కానీ, వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో గెలుపొందాలని టీడీపీ చూస్తుందన్నారు. 2019 ఎన్నికల ముందు ఎన్నికల కమిషన్ బెదిరించిన వ్యక్తి చంద్రబాబన్న ఆయన.. తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు ఫిర్యాదు చేసి అధికారుల్ని బెదిరిస్తున్నారు. ఒక భూతాన్ని క్రియేట్ వ్యవస్థలను, ఎన్నికల కమిషన్ ను బెదిరించాలని చూస్తున్నారు.. ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేస్తున్నాం. పెన్షన్ లు పంపిణీ జరగకుండా అడ్డుకుంది టీడీపీయే.. మళ్ళీ ఇప్పుడు ఆలస్యం అవ్వకుండా పెన్షన్లు పంపిణీ చేయాలని వాళ్లే గొడవ చేస్తున్నారు అని ఫైర్ అయ్యారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.
తాజావార్తలు
-
Renukaswamy Murder: నటుడు దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
-
Ganja Smuggling: టెక్నాలజీతో గంజాయి దందా.. బాలానగర్‌లో గంజాయి స్మగ్లర్ల కొత్త స్కెచ్!
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!