Site icon NTV Telugu

Sajjala Ramakrishna Reddy: మండలిలో వైసీపీ మెజారిటీ సభ్యులు అట్టడుగు వర్గాల వారే..!

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy: ఎమ్మెల్సీలుగా ఎన్నికై ప్రమాణస్వీకారం చేసిన మండలి సభ్యులకు అభినందనలు తెలిపారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన టీడీపీ, విపక్షాలపై ఫైర్‌ అయ్యారు.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు తమ తలరాత వాళ్ళే రాసుకునే విధంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్ణయాలు ఉన్నాయన్న ఆయన.. 17 మంది గెలిస్తే వారిలో 10 మంది బీసీ వర్గాలకు చెందినవారే అన్నారు. జూన్ నాటికి మండలిలో వైసీపీ మెజారిటీ సభ్యులు అట్టడుగు వర్గాల వారే ఉంటారని ప్రకటించారు.. అయితే, ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు.. చంద్రబాబుకు బీసీలు ఓట్ బ్యాంకు మాత్రమే నన్న ఆయన.. తాను అధికారంలో ఉన్నప్పుడు మైనారిటీ, దళిత వర్గాలకు కేబినెట్‌లో అవకాశం ఇవ్వలేదన్నారు.. చంద్రబాబు మోసానికి, వెన్నుపోటుకు ట్రేడ్ మార్క్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Read Also: Rajamouli : సైబర్ నేరాలపై దర్శకధీరుడు రాజమౌళి క్లాసులు

చంద్రబాబు వెనుక నడిచే ఏ, బీ, సీ టీంలు చేసే ప్రచారంతో మేం పోటీ పడలేం అంటూ సెటైర్లు వేశారు సజ్జల.. ప్రజలను భ్రమల్లో పెట్టి వాళ్ళ వర్గం మాత్రమే బాగుపడాలని చూస్తారన్న ఆయన.. ప్రజలు ప్రతీ చోట చంద్రబాబును నిలదీయాలని పిలుపునిచ్చారు. అధికారం ఇచ్చినప్పుడు ఏం చేశావ్ అని చంద్రబాబును అడగాలన్నారు.. అంతర్జాతీయ స్కాం.. అమరావతి రియల్ ఎస్టేట్ స్కాం అంటూ ఆరోపించారు.. ఇక, 175 స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పగలిగే దమ్ము చంద్రబాబుకు ఉందా? అని సవాల్‌ చేశారు. తన ప్రభుత్వంలో ఏం చేశాడో చెప్పుకునే ధైర్యం బాబుకు లేదన్న ఆయన.. మారీచులతో పోరాడుతున్నాం.. ఎక్కడ కొడతారో ఎక్కడ తగులుతుందో తెలియదు.. వాళ్లకు లా టక్కుటమార విద్యలు మాకు రావన్నారు.. తోడేళ్ళ మంద మళ్ళీ ప్రజల ముందుకు వస్తోంది.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు సజ్జల రామకృష్ణారెడ్డి.

Exit mobile version