Rajamouli : తన మార్కు టేకింగ్తో అంతర్జాతీయ గుర్తింపును సంపాదించుకున్నారు దర్శకధీరుడు రాజమౌళి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో వరల్డ్ వైడ్ పాపులారిటీ దక్కించుకున్నారు. ఓ స్టార్ హీరోతో ఈక్వల్ స్టార్‌డమ్ సొంతం చేసుకున్నారు. రాజమౌళి క్రేజ్ ని పలువురు అధికారులు వినియోగించుకుంటున్నారు. ఆయనతో సామాజిక భద్రత కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు సహకరించాలని కోరారు. తాజాగా హైదరాబాద్ సైబర్ అధికారులు కూడా రాజమౌళి సేవలు కోసం ఆయనని సంప్రదించారు.
Read Also: Sumanth: గెస్ట్ రోల్సేనా…. సోలో హీరోగా సినిమా ఎప్పుడు!?
ఈ ప్రోగ్రాంలో రాజమౌళి మాట్లాడుతూ.. ‘మా షూటింగ్ సెట్లో వర్క్ చేస్తున్న ఒక వ్యక్తి సైతం ఈ సైబర్ మోసానికి గురయ్యాడు. బ్యాంక్ మేనేజర్ అని చెప్పి ఓటిపి(OTP) అడిగాడు. తను ఆలోచించకుండా అతను చెప్పేశాడు. అంతే అతని బ్యాంక్ ఖాతా నుండి సైబర్ నేరగాళ్లు 10 నెలల జీతాన్ని కొట్టేశారు. కష్టపడి సంపాదించే డబ్బుతో వచ్చే ఆనందం వేరు. కానీ ఈజీ మనీ దురాశే సైబర్ మోసానికి దారితీస్తుంది… పెద్ద పొలిటీషియన్, స్టార్ సెలబ్రిటీ మొదలుకుని సాధారణ కూలీ వరకు ప్రతీ ఒక్కరూ సైబర్ క్రైమ్ బాధితులే. రెండు రూపాయల వడ్డీ కన్నా ఎక్కువ ఇస్తున్నాడు అంటే అది కచ్చితంగా మోసం, ఇల్లీగల్ మనీ అయి ఉంటుంది. వంద పెడితే వెయ్యి, వెయ్యి పెడితే లక్ష, లక్ష పెడితే పది లక్షలు వస్తాయని మోసపోయి డబ్బులు పోగొట్టుకోవడం మన అవివేకం’ అంటూ రాజమౌళి చెప్పుకొచ్చాడు.
Read Also: India: శరణార్థి పాలసీని దుర్వినియోగం చేస్తున్న ఖలిస్తానీవాదులు.. యూకేకు తేల్చి చెప్పిన ఇండియా..
ఇక ఈ సమ్మిట్ లోనే తనకి ఉన్న కొన్ని సందేహాలను రాజమౌళి సైబర్ క్రైమ్ పోలీసులను అడిగాడు.
1 – నా క్రెడిట్ కార్డు ఎక్స్‌పైరీ అయింది అర్జెంటుగా కేవైసీ ఫామ్ నింపండి అని కాల్ వస్తే ఏమి చేయాలి?
2 – నాకు కూడా ఎన్నో ఫేక్ కాల్స్ వచ్చాయి, బ్యాంక్ నుంచి చేస్తున్నామని, పోలీస్ డిపార్ట్మెంట్ అని!
3 – అన్ లైన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ కాల్స్ కూడా వచ్చాయి ఏమి చేయాలి ఎలా ఫిర్యాదు చేయాలి?
4 – చాలా వెబ్ సైట్స్ ఫేక్ ఉన్నాయి. గూగుల్ లో నుండి కస్టమర్ కేర్ నంబర్ ద్వారా ఫ్రాడ్ జరుగుతుంది ఎలా?
రాజమౌళి ప్రశ్నలకుపోలీస్ శాఖ సమాధానం ఇస్తూ..
->www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయవచ్చు.
->వెంటనే 1930 డయల్ చేయండి.
->మా పోలీస్ వారు మిమల్ని గైడ్ చేస్తారు.