Sajjala Ramakrishna Reddy: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పొత్తులు, సీఎం పోస్టు వ్యవహారంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఎటాక్ చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. కుక్క తోకను ఆడించగలదు.. కానీ, తోక కుక్కను ఆడించ లేదు అని కామెంట్ చేశారు.. పవన్ కల్యాణ్ ఇమేజ్ ఒక నీటి బుడగగా అభివర్ణించిన ఆయన.. పవన్ కు ఇమేజ్ ఉన్నట్లు చంద్రబాబు కొన్ని మీడియా సంస్థల సహాయంతో సృష్టిస్తున్నాడని ఎద్దేవా చేశారు.. చంద్రబాబు పల్లకి మోయటమే తన ఎజెండా అని పవన్ స్పష్టత ఇచ్చారన్న ఆయన.. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా 2019లో ప్రయత్నించాడని గుర్తుచేశారు.
Read Also: Pawan Kalyan: నేను సంపూర్ణమైన రైతును కాను.. అన్నీ తెలుసంటున్న మీరేం చేశారు..
ఇక, ముఖ్యమంత్రి కావాలనే చంద్రబాబు కలనే పవన్ కల్యాణ్ కంటున్నాడు అంటూ సెటైర్లు వేశారు సజ్జల.. తనకు బలం లేదని పవన్ అంగీకరించారన్న ఆయన.. తనను ముఖ్యమంత్రిని చేయాలనే అభిమానులను చంద్రబాబుకు తాకట్టుపెడుతున్నాడని కామెంట్ చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.. కాగా, వైసీపీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రభావితం చేసే పార్టీలు కలవాలని కోరుకుంటున్నాం అన్నారు పవన్ కల్యాణ్.. బీజేపీ, బీఆర్ఎస్ వంటి పార్టీలు పొత్తులతోనే బలపడ్డాయని వ్యాఖ్యానించారు.. ప్రతి పార్టీకి వారి వారి ఓట్లు.. వారి వారి బలం ఉంటుంది. కానీ, కలిసి వెళ్తే మరింత బలంగా పోరాడవచ్చు అన్నారు. ఇక, ఉనికి చాటుకోవడానికి పార్టీ పెట్టలేదని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్.. మేం గత ఎన్నికల్లో 137స్థానాల్లో పోటీ చేశామని గుర్తుచేసుకున్నారు. కచ్చితంగా పొత్తులు పెట్టుకుంటాం.. ఎవరైనా పొత్తులకు ఒప్పుకోకుంటే ఒప్పిస్తామని ప్రకటించారు.. గత ఎన్నికల్లో మమ్మల్ని కనీసం 40 స్థానాల్లో గెలిపించి ఉండాల్సింది అన్నారు. కనీసం 30-40 స్థానాలుంటేనే సీఎం అభ్యర్థిగా ఉంటామని అనగలం అన్నారు జనసేనాని.. ముందస్తు ఎన్నికలు వస్తే జూన్ నుంచి క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేపడతామని ప్రకటించారు.. మా బలం మీదే ఆధారపడి సీట్ షేరింగ్ ఉంటుందని వెల్లడించారు. జనసేనకు పట్టున్న ప్రాంతాల్లో కచ్చితంగా పోటీ చేస్తామని తెలిపారు.. ఇక, సీఎం కావాలనుకుంటే సీఎం అయిపోరు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.. నన్ను సీఎంని చేయాలని టీడీపీనో.. బీజేపీనో అడగబోనన్న ఆయన.. నా సత్తా ఏంటో చూపించి అడుగుతానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్న విషయం విదితమే.