Sajjala Ramakrishna Reddy: తప్పుడు సర్వేలు చూసుకుని టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.. టీడీపీ సంబరాలు తాత్కాలికం మాత్రమే.. అసలు సంబరాలు రేపు మేం చేస్తాం అన్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. ఈసీ నిబంధనలు తప్పుబట్టిన ఆయన.. ఈసారి ప్రతిదీ నిబంధనలకు విరుద్ధంగానే ఈసీ చేస్తుంది.. ఈసీపై చంద్రబాబు కంట్రోల్ ఉందని తెలిసిపోతుంది.. ఎన్డీఏతో పొత్తు పెట్టుకునప్పటి నుండి ఈసీ ద్వారా అధికారులపై వత్తిడి తెచ్చారు.. ఎవరెన్ని పాచికలు విసిరినా వైసీపీ ముందు అవి పారవు అన్నారు. వైసీపీ బలమైన పార్టీ.. బలమైన మెజారిటీతో గెలుస్తున్నాం.. టీడీపీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఈ ఒక్క రోజు వరకే.. చంద్రబాబుకి పిక్చర్ తెలుసు కనుక గుమ్మనంగా ఉన్నాడు.. లోకేష్ అయితే అసలు అడ్రెస్స్ లేడు అంటూ ఎద్దేవా చేశారు.
Read Also: Amul Milk Prices: మరోసారి పెరిగిన అమూల్ పాల ధరలు.. లీటరుకు ఎంతంటే..
జాతీయ స్థాయిలో కొన్ని సర్వేలు బీజేపీ కోసం ఎన్డీఏ వైపు ఇచ్చాయి.. ఎన్డీఏకు 400 చూపించడం కోసం ఆ సంస్థలు అలా సెట్ చేశారు.. వాళ్లు ఇచ్చిన ఫిగర్స్ చూసి జనం నవ్వుకుంటున్నారు అని సెటైర్లు వేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.. తప్పుడు సర్వేలు చూసుకుని టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.. టీడీపీ సంబరాలు తాత్కాలికం మాత్రమే.. అసలు సంబరాలు రేపు మేం చేస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. ఇక, కౌంటింగ్ కి అన్ని రకాలుగా సిద్దంగా ఉన్నాం.. అందరికీ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చాం.. కౌంటింగ్ పూర్తి అయ్యి డిక్లరేషన్ తీసుకునే వరకు ఎవరూ కేంద్రాల నుండి బయటకి రావద్దని చెప్పామన్నారు. రేపు 11 గంటలకు సంబరాలకు సిద్దంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చాం అన్నారు. మరోవైపు.. పోస్టల్ బ్యాలెట్ ఇష్యూపై స్పందిస్తూ.. సుప్రీంకోర్టు కొట్టేసినా ఎన్నికల కమిషన్ చేసింది తప్పే అని అందరికీ తెలుసు అని వ్యాఖ్యానించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.