NTV Telugu Site icon

Sajeeb Wazed Joy: పాకిస్థాన్‌కు పట్టిన గతే బంగ్లాదేశ్‌కు పడుతుంది..షేక్ హసీనా కుమారుడు సంచలన వ్యాఖ్యలు

Hasina Joy

Hasina Joy

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ప్రస్తుతానికి భారత్‌లోనే ఉంటారని షేక్ హసీనా కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్ చెప్పారు. ఇప్పట్లో ఇక్కడి నుంచి వెళ్లే ఆలోచన లేదని తేల్చిచెప్పారు. ఆయన బుధవారం డ్యుయిష్ వెల్లేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమాచారం అందించారు. “హసీనా ఆరోగ్యంగా ఉంది. నా సోదరి ఆమెతో ఉంది. కానీ మాజీ ప్రధాని చాలా బాధపడుతున్నారు. దేశం కోసం బంగాబంధువులు తమ జీవితాన్ని త్యాగం చేయడం తనను కలచివేసింది. గత ఒకటిన్నర దశాబ్దంలో దేశం ఎంతో అభివృద్ధి సాధించింది. అయినప్పటికీ, ఆమెను బయటకు విసిరేశారు.” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

READ MORE: Buddhadeb Bhattacharya : బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూత

షేక్ హసీనా కుమార్తె సైమా వాజెద్ ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్ గా ఉన్నారు. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. దీంతో షేక్ హసీనా సోమవారం ఢిల్లీకి సమీపంలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కు చేరుకున్నారు. భారీ భద్రతతో ఢిల్లీలోని సురక్షిత ప్రదేశానికి పంపిన విషయం తెలిసిందే.

READ MORE:Gold Rate Today: మగువలకు శుభవార్త.. నేటి గోల్డ్ రేట్స్ ఇవే!

డ్యుయిష్ వెల్లేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. మూడవ దేశం నుంచి ఆశ్రయం పొందాలనే హసీనా ప్రణాళిక గురించి జాయ్‌ని అడిగినప్పుడు.. “ఇవన్నీ పుకార్లు. ఈ విషయంలో ఆమె ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరికొంత కాలం ఆమె ఢిల్లీలోనే ఉంటారు. నా సోదరి ఆమెతోనే ఉంది. కాబట్టి ఆమె ఒంటరిగా లేరు.” అని స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా శాంతిభద్రతలను పునరుద్ధరించకుంటే పాకిస్థాన్‌కు పట్టిన గతే బంగ్లాదేశ్‌కు కూడా వస్తుందని షేక్ హసీనా కుమారుడు అన్నారు. నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ దేశాన్ని ఎలా నడిపిస్తారో వేచి చూడాలని ఆయన అన్నారు. హసీనాతో పాటు ఆమె సోదరి షేక్ రెహానా కూడా ఉన్నారు.

READ MORE:Hyderabad Police: ప్రయాణికులకు అలర్ట్‌.. రాంగ్ రూట్‌లో వెళ్తే జైలుకే..

జాయ్‌ను రాజకీయాల్లోకి రావడానికి ఏమైనా ప్లాన్‌లు ఉన్నాయా అని అడగ్గా.. దానికి అతను నవ్వి, “ప్రస్తుతానికి అలాంటి ప్రణాళికలేవీ లేవు. మా కుటుంబంపై తిరుగుబాటు జరగడం ఇది మూడోసారి. హసీనా మినహా తన కుటుంబ సభ్యులందరూ ఇప్పటికే చాలా కాలంగా విదేశాల్లో నివసిస్తున్నారు. షేక్ రెహానా లేదా ఇతర కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదు” అని స్పష్టం చేశారు.