Gold Price Today in Vijayawada and Hyderabad: ఇటీవలి వరుసగా పెరిగిన బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. గత రెండు రోజుల్లో పసిడి ధర ఏకంగా రూ.1310 మేరకు తగ్గింది. వరుసగా రెండు రోజులు తగ్గిన బంగారం ధరలు.. నేడు స్థిరంగా కొనసాగుతూన్నాయి. బులియన్ మార్కెట్‌లో గురువారం (ఆగష్టు 8) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,500గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,270గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయాయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,500లుగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.69,270గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.63,650 పలకగా.. 24 క్యారెట్ల ధర రూ.69,420గా నమోదైంది. బెంగళూరు, కోల్‌కతా, పూణే, కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.69,270గా ఉంది.
Also Read: Anushka Sharma: పెళ్లికి ముందే తల్లినయ్యా.. అనుష్క శర్మ షాకింగ్ కామెంట్స్!
మరోవైపు వెండి ధర నేడు స్వల్పంగా తగ్గింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.500 తగ్గి.. రూ.81,500గా నమోదైంది. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.86,500గా ఉంది. ఢిల్లీలో రూ.81,500గా.. ముంబైలో రూ.81,500గా ఉంది. అత్యల్పంగా బెంగళూరులో 81,000గా నమోదైంది.