టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేశ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం సైంధవ్.హిట్ ఫేం శైలేష్ కొలను ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో వెంకటేశ్ 75వ ప్రాజెక్టుగా వస్తున్న ఈ మూవీని 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఇటీవలే మేకర్స్ సైంధవ్ ఫస్ట్ సింగిల్ ‘రాంగ్ యూ సేజ్’ సాంగ్ ను నవంబర్ 21న లాంఛ్ చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే…సైంధవ్ ఫస్ట్ సింగిల్ త్వరలోనే అంటూ వెంకీ అండ్ టీం చిల్ అవుట్ మూడ్‌లో ఉన్న లుక్‌ను కూడా లాంఛ్ చేయగా.. నెట్టింట తెగ వైరల్ అవుతుంది..తాజాగా సాంగ్ లాంఛ్ ఈవెంట్ వెన్యూతో పాటు టైం ను కూడా మేకర్స్ తెలియజేశారు. ఈ పాట లాంఛింగ్ ఈవెంట్‌ను రెండు చోట్ల ప్లాన్ చేయడం విశేషం.
హైదరాబాద్‌లోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ లో రేపు మధ్యాహ్నం 2 గంటలకు అలాగే విఎన్ఆర్ విజెఐఈటీ కాలేజీల్లో రేపు మధ్యాహ్నం 3 గంటలకు విద్యార్థుల సమక్షంలో సాంగ్ లాంఛ్ ఈవెంట్ జరుగనుంది.ఈవెంట్‌కు ఎవరెవరు వస్తున్నారు.. ఇతర వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది.చంద్రప్రస్థ ఫిక్షనల్ పోర్ట్ ఏరియా బ్యాక్‌డ్రాప్‌లో సాగే మిషన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సైంధవ్‌లో జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది… ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య, రుహానీ శర్మ మరియు ఆండ్రియా జెర్మియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీతో బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు..ఇప్పటికే మేకర్స్ సైంధవ్ పాత్రలకు సంబంధించిన ఇంట్రడక్షన్ వీడియో షేర్ చేయగా.. నెట్టింట తెగ వైరల్ అవుతుంది..ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ మనోజ్ఞగా, రుహానీ శర్మ డాక్టర్‌గా, నవాజుద్దీన్ సిద్దిఖీ వికాస్ మాలిక్ పాత్రలో అలాగే కోలీవుడ్ యాక్టర్ ఆర్య మానస్ పాత్రలో కనిపించనున్నారు. సైంధవ్ మూవీని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు.. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు..