మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోలలో మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఒకరు.. మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఆ తర్వాత కొన్ని సినిమాలు హిట్ టాక్ ను అందుకోగా మరికొన్ని సినిమాలు మాత్రం హిట్ అవ్వగా.. కొన్ని సినిమాలు ప్లాప్ అయ్యాయి.. ఇటీవల విరుపాక్ష సినిమా తో బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలో నటిస్తున్నాడు.. అయితే తాజాగా ఓ వార్త ఇండస్ట్రీలో షికారు చేస్తుంది.. ఓ హీరోయిన్ తో తేజ్ లవ్ లో ఉన్నాడంటూ వార్త వినిపిస్తుంది.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది..
ఇక మొన్నీమధ్య మెగా హీరో వరుణ్ తేజ్…లావణ్య ల ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది..వారం రోజులుగా వీరి ఎంగేజ్మెంట్ గురించే సోషల్ మీడియాలో ఎక్కువ చర్చ జరుగుతూ వస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే వీరి పెళ్లి డేట్ ఫిక్స్ కాలేదు.. కానీ ఇప్పుడు మరో వార్త వినిపిస్తుంది.. వీరిద్దరి ఎంగేజ్మెంట్ కన్నా ముందే సాయి ధరమ్ తేజ్ – రెజీనా ల గురించి ఎక్కువ వార్తలు వచ్చేవి. వీళ్ళు పెళ్లి చేసుకుంటారనే చర్చ కూడా జరిగింది. సాయి ధరమ్ తేజ్, రెజీనా కాంబినేషన్లో ‘పిల్లా నువ్వు లేని జీవితం’ ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ వంటి సినిమాలు వచ్చాయి.. ఆ సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి..
ఈ సినిమాల టైంలో తేజు,రెజీనా బాగా క్లోజ్ అయ్యారు. ఈ క్రమంలో వీరు డేటింగ్ చేస్తున్నారు అనే చర్చ కూడా గట్టిగానే జరిగింది..కానీ అలాంటిది ఏమీ లేదని.. మేము మంచి స్నేహితులం అంటూ వీళ్ళు క్లారిటీ ఇస్తూ వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టారు. అయినప్పటికీ వీళ్ళు ప్రైవేట్ గా కలిసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ ఫోటోలు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు అనే టాక్ ఉంది. ఓ సందర్భంలో ‘కొందరి అత్యుత్సాహం వల్ల నేను కొందరితో స్నేహం వదులుకోవాల్సి వచ్చింది’ అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.. అప్పుడే వీరిద్దరికీ బ్రేకప్ అయ్యిందని వార్తలు వచ్చాయి..కానీ కొందరు యాంటి ఫ్యాన్స్ మాత్రం వీరిద్దరిపై ఇంకా రూమర్స్ స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారు.. ప్రస్తుతం తేజు రెండు సినిమాలు చేస్తున్నాడు..