Sai Dharam Tej: ఒకానొక సమయంలో మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న మెగా హీరో సాయి దుర్గ తేజ్, ఆ తర్వాత జరిగిన ఒక ప్రమాదం కారణంగా వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిపరమైన కెరీర్లోనూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రమాదం తర్వాత ఆయన చేసిన సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. దీంతో తన తదుపరి చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’పై సాయి తేజ్ చాలా ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఆయన కెరీర్‌కు ఎలాంటి మలుపు ఇవ్వబోతోందని మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు.
Chiranjeevi: మరోసారి ఆ కాంబో రిపీట్ కానుందా? మెగాస్టార్ మల్టీస్టారర్ చేయబోతున్నారా.!
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాయి దుర్గ తేజ్, కెరీర్ ఆరంభంలో వరుస విజయాలతో తన సత్తా చాటారు. కొన్నాళ్లు తడబడ్డా, కనీసం మినిమం గ్యారంటీ హీరో అనే ట్యాగ్‌ను మాత్రం కాపాడుకుంటూ వచ్చారు. కానీ, బైక్ యాక్సిడెంట్లో గాయపడిన తర్వాత సాయి దుర్గ తేజ్ కెరీర్ తీవ్రంగా డిస్టర్బ్ అయింది. ప్రమాదం నుంచి కోలుకున్నాక తెరపైకి వచ్చినప్పటికీ, ఆయన ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో రీచ్ కాలేకపోయారు. గత చిత్రాల్లో ఆయన లుక్స్ పరంగా చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. అంతేకాక, డైలాగ్ డెలివరీ విషయంలో కూడా కాస్త ఇబ్బంది పడ్డారు. ఈ ప్రభావం సినిమా ఫలితాలపై కూడా స్పష్టంగా కనిపించింది.
ఇప్పుడు అలాంటి అన్ని ఇబ్బందుల్ని దాటుకొని సాయి దుర్గ తేజ్ ఒక పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘సంబరాల ఏటిగట్టు’ పేరుతో తెరకెక్కుతున్న ఈ పిరియాడిక్ మూవీలో సాయి తేజ్ సిక్స్ ప్యాక్ ఫిజిక్‌తో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా విడుదలైన గ్లింప్స్‌లో ఆయన లుక్స్ అద్భుతంగా ఉండటమే కాక, డైలాగ్ డెలివరీలోనూ “వావ్” అనిపించారు. ఈ తాజా టీజర్ చూసిన తర్వాత, సాయి తేజ్ అన్ని అడ్డంకులను దాటుకొని బౌన్స్ బ్యాక్ అయినట్లే అని మెగా అభిమానులు, సినీ వర్గాలు భావిస్తున్నారు. ఈ సినిమాతో మెగా హీరో మళ్లీ లైన్లో పడి తన పూర్వ వైభవాన్ని అందుకుంటాడని ఫ్యాన్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు.