Sachin Tendulkar: క్రికెట్ దేవుడి సచిన్ టెండూల్కర్ మైదానంలోకి దిగితే రికార్డులు సృష్టిస్తాడని అందరికి తెలుసు. కానీ ఈ మాస్టర్ బ్లాస్టర్ సంపద సృష్టించడంలో కూడా అదే స్థాయిలో రికార్డులు నెలకొల్పుతున్నట్లు చాలా తక్కువ మందికే తెలుసు. నిజానికి సచిన్ టెండూల్కర్ ప్రపంచంలో అత్యంత ధనవంతులైన క్రికెటర్లలో ఒకరిగా ఉన్నారు. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా మాస్టర్ బ్లాస్టర్ నికర విలువ పెరుగుతూనే ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు చేసిన ప్రపంచంలోని ఏకైక క్రికెటర్‌గా సచిన్ పేరిట రికార్డు ఉన్న విషయం తెలిసిందే.
READ ALSO: Hyderabad: నార్సింగి లో దారుణం.. కాళ్ల పట్టీల కోసం వివాహిత దారుణ హత్య..
16 ఏళ్ల వయస్సులో మైదానంలోకి అడుగు పెట్టిన ఈ దిగ్గజ బ్యాట్స్‌మెన్స్, 17 సంవత్సరాల వయస్సులో ఇంగ్లాండ్‌పై తన మొదటి టెస్ట్ సెంచరీని సాధించాడు. ఆ సమయంలో సచిన్ ప్రపంచంలోని అత్యుత్తమ బౌలింగ్ దాడులను సులువుగా ఎదుర్కొని మైదానంలో పరుగుల వరద పారించాడు. ప్రస్తుతం ఈ క్రికెట్ దిగ్గజానికి BCCI పెన్షన్ ఇస్తుంది. అలాగే సచిన్ అనేక ప్రధాన కంపెనీలతో ఒప్పందాలు కలిగి ఉన్నాడు. వీటి ద్వారా ఆయనకు గణనీయమైన ఆదాయం లభిస్తుంది. ఈ దిగ్గజ బ్యాట్స్‌మన్ తను ఆదాయాన్ని ఆర్జించే అనేక ప్రధాన కంపెనీలలో పెట్టుబడులు కూడా పెట్టాడు.
సచిన్ టెండూల్కర్ నికర ఆస్తుల విలువ సుమారు రూ.1,472 కోట్లు..
పలు నివేదికల ప్రకారం.. సచిన్ టెండూల్కర్ నికర ఆస్తుల విలువ సుమారు రూ.1,472 కోట్లు అని అంచనా. నవంబర్ 2013లో క్రికెట్ నుంచి రిటైర్ అయిన సచిన్ టెండూల్కర్, మైదానంలో ఆడినప్పుడు చాలా సంపాదించాడని చెబుతారు. ఆయన ఆ టైంలో కేవలం ప్రకటనల ద్వారా కోట్లు సంపాదించినట్లు పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయనకు BCCI నుంచి సుమారు రూ.70 వేల నెలవారీ పెన్షన్ కూడా అందుతుంది. అలాగే ఈ దిగ్గజ బ్యాట్స్‌మెన్ ప్రస్తుతం పలు ప్రధాన కంపెనీల నుంచి ఎండార్స్‌మెంట్‌లను కలిగి ఉన్నాడు. వీటి ద్వారా ఆయన కోట్లాది రూపాయలను ఆర్జిస్తున్నట్లు సమాచారం. IPL ద్వారా, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల నుంచి కోట్లు సంపాదిస్తున్నాడని పలు నివేదికలు తెలిపాయి. దీనితో పాటు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ వ్యాపారంలో కూడా కోట్లు పెట్టుబడి పెట్టాడని తెలిపాయి. ఆయన రెస్టారెంట్ వ్యాపారంలో కూడా చురుకుగా ఉన్నాడు. ముంబై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో సచిన్ & టెండూల్కర్ అనే రెస్టారెంట్‌లను ఆయన యజమానిగా ఉన్నాడు.
ఆయన ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని మూడు అంతస్తుల బంగ్లాలో నివసిస్తున్నారు. పలు నివేదికల ప్రకారం.. ఈ బంగ్లా విలువ దాదాపు రూ.100 కోట్లు. అలాగే ఆయనకు ముంబైలో ఒక ఫ్లాట్ కూడా ఉంది. దీని విలువ దాదాపు రూ.8 కోట్ల ఉంటుందని అంచనా. ఆయనకు కేరళలో దాదాపు రూ.78 కోట్ల ఆస్తి ఉన్నట్లు సమాచారం. సచిన్ వద్ద ఫెరారీ 360 మోడెనా కారు ఉంది. దీని ధర దాదాపు రూ.2 కోట్లు. అలాగే ఆయన వద్ద నిస్సాన్ GT-R, BMW 750 కూడా ఉన్నాయి.
READ ALSO: Rakul Preet Singh: మేకప్ మ్యాన్ కల నెరవేర్చిన రకుల్