NTV Telugu Site icon

Sabitha Indra Reddy : హైడ్రాపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఘాటు వ్యాఖ్యలు

Sabitha Indra Reddy

Sabitha Indra Reddy

హైడ్రా పై మాజీ మంత్రి సబితా ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ఒక పబ్లిసిటీ స్టంట్. మీడియా, సోషల్ మీడియాలో హడావుడి చేయడం తప్పా హైడ్రాకు ఏమి పని లేదంటూ తీవ్ర స్థాయిలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండి‌పడ్డారు. రంగారెడ్డి జిల్లా మణికొండ అల్కపూర్ టౌన్ షిఫ్ సెలబ్రేషన్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో సబితా, ఆమె తనయుడు కార్తిక్ రెడ్డి పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మార్క్ తొలగించడానికి హైడ్రాను ఒక ఆయుధంగా వాడుకుంటున్నారని ఆమె విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చకుండా గత 8 నెలలుగా కేసీఆర్ పై అన్ని విధాలుగా బురదజల్లే కార్యక్రమాన్ని చేపడుతున్నారని ఆమె మండిపడ్డారు. ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేసినా కేసీఆర్ మార్క్ మాత్రం చేరిపి వేయడంలో విఫలమయ్యారని ఆమె వ్యాఖ్యానించారు.

Ap Floods : 3 రోజుల్లో 60 వేల మందికి రేషన్ పంపిణీ.. 42 డ్రోన్ల సహాయంతో లక్ష మందికి పైగా ఫుడ్

కొత్తగా హైడ్రాను రంగంలో దించి సామాన్యులను ఇబ్బందుల పాలు చేస్తున్నారని, ఔటర్ రింగు రోడ్డు చుట్టూ 30వేల ఎకరాలలో 4 లక్షల నిర్మాణాలు అక్రమ నిర్మాణాలు ఉన్నాయని అందులో 10% శాతం కూల్చివేసినా గొప్ప విషయమే అని ఆమె అన్నారు. రోజుకు నాలుగు దిక్కుల హైడ్రా కూల్చివేతలు చేపడుతుంది. దానికి ఒక ప్రణాళిక లేదు. ఏ ఒక్క చెరువును సరియైన పద్దతిలో కాపాడింది లేదని, సామాన్యుల ఉసురు కాంగ్రెస్ ప్రభుత్వంకు తాకుతుందన్నారు. గత 30 సంవత్సరాల క్రితం పైసా పైసా కూడబెట్టుకొని నిర్మాణాలు చేసుకుంటే ఈ రోజు వచ్చి మీ‌ నిర్మాణాలు అక్రమం అంటూ కూల్చివేతలు చేపడితే గుండె పోటు వచ్చి చనిపోతారని, ఈ పాపం ఎవరిదో వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అని ఆమె అన్నారు. హైడ్రా ఒక డ్రామా, ఆ డ్రామా గుట్టును త్వరలోనే రట్టు చేస్తాం అని ఆమె అన్నారు.

Traffic Constable: విషాదం.. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆత్మహత్య..