NTV Telugu Site icon

Sabitha Indra Reddy : మీ స్వార్ధ రాజకీయాల కోసం విద్యార్ధుల జీవితాలతో చెలగాటమాడుతారా

Sabitha

Sabitha

టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రం లీకేజీ నుంచి నేడు పదో తరగతి పేపర్ లీకేజీ వరకు కుట్ర కోణం దాగివుందన్నారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. వికారాబాద్ లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనే ఆలోచనతోనే పేపర్ లీకేజీలకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ పెద్దల పర్యవేక్షణలోనే రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుట్ర పన్నారని ఆమె మండిపడ్డారు.

Also Read : Man Cheated 30 Women: నిత్య పెళ్లికొడుకు అరెస్ట్.. 30 మందిని మోసం చేశాడు

మీ స్వార్ధ రాజకీయాల కోసం ఐదు లక్షల మంది విద్యార్ధుల జీవితాలతో చెలగాటం అడుగుతారా ఆని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ రాజశేఖర్, పదవ తరగతి పేపర్ లీకేజ్ లో పాత్ర ఉన్న ప్రశాంత్ లకు బీజేపీ నాయకులతో సంబంధాలు ఉన్నాయని ఆమె వెల్లడించారు. అంతేకాకుండా.. వికారాబాద్ జిల్లా తాండూరులో పదవ తరగతి పేపర్ లీకేజీ చేసిన టీచర్ కూడా బీజేపీ అనుబంధ సంఘం సభ్యులు అని ఆమె అన్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనుకునేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఆమె స్పష్టం చేశారు.

Also Read : Gangster Deepak: ఢిల్లీలో అడుగుపెట్టిన గ్యాంగ్‌స్టర్‌ దీపక్ బాక్సర్