Rythu Bharosa : రైతులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి శుభవార్త అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకం కింద నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. జనవరి 26న ప్రారంభమైన ఈ పథకం అమలులో భాగంగా, ఫిబ్రవరి 5న ఒక ఎకరానికి లోపు భూమి కలిగిన రైతులకు నిధులు జమ చేసిన విషయం తెలిసిందే. తాజాగా, సోమవారం ప్రభుత్వం మరోసారి రెండు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు నిధులను విడుదల చేసింది. గత నెల 27న 4,41,911 రైతుల 9,48,332.35 ఎకరాలకు రూ.5,68,99,97,265 నిధులు జమ చేయగా.. ఈనెల 5వ తేదీన 17,03,419 రైతులకు చెందిన 9,29,234.20 ఎకరాలకు రూ. 5,57,54,07,019 నిధులు విడుదల చేశారు. అయితే.. ఈ రోజు 8,65,999 మంది రైతులకు చెందిన 11,79,247.17 ఎకరాలకు రూ. 7,07,54,84,664 లకు జమ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటివరకు మొత్తంగా 30,11,329 రైతులకు చెందిన 30,56,814.32 ఎకరాలకు రూ. 18,34,08,88,948 లను లబ్దిదారుల ఖాతాల్లో జమచేసినట్లు పేర్కొంది.
Veera Raghava Reddy : రామరాజ్యం ఆర్మీ వీర రాఘవరెడ్డి అరెస్టు..