ఓ తల్లి ఆ పేరుకే మచ్చను తీసుకొచ్చింది.. కన్న పేగును కూడా మరచి ముగ్గురు పిల్లలను అతి దారుణంగా హత్య చేసి బావిలో పడేసింది.. ఆ తర్వాత తాను కూడా తన ఇంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యా యత్నం చేసింది..కేకలు విన్న కుటుంబ సభ్యులు, స్థానికులు మంటలను ఆర్పివేశారు. మంటలు ఆర్పిన తర్వాత ముగ్గురు పిల్లలను బావిలో పడేసినట్లు తల్లి చెప్పింది.. ఈ ఘటన పై పోలీసులకు సమాచారం అందగా అక్కడికి చేరుకొని మహిళను అరెస్ట్ చేశారు..
వివరాల్లోకి వెళితే.. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ ప్రాంతంలో జరిగింది.. మిర్జాపూర్ జిల్లా సంత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పజ్రా గ్రామంలో శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో సుధ అనే వివాహిత తన భర్త అమర్జీత్‌తో ఫోన్‌లో మాట్లాడింది. భర్త ముంబైలో ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు. ఫోన్‌లో ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలో ఏదో వాగ్వాదం జరిగింది. అయితే కోపంతో రగిలిపోయిన తల్లి పిల్లలను బావిలో పడేసింది..ఆ తర్వాత తాను ఇంటికి తాళం వేసి నిప్పాంటించుకుంది.. అది గమనించిన చుట్టుపక్కల వాళ్ళు ఆమెను కాపాడారు…
ఇక పిల్లల మృతదేహాలను గ్రామస్థుల సహాయంతో బంధువులు బావిలో నుంచి బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.. ఈ విషయాన్ని ఆమె భర్తకు చెప్పగా..మా ఇద్దరికీ అస్సలు మాటలు లేవని చెప్పాడు.. వీరికి తరచూ వాగ్వాదాలు జరిగేవనీ, అలాంటి ఓ వాదన సమయంలో ఆ మహిళ కోపంతో ఈ తీవ్ర చర్య తీసుకుందని తెలిపారు..మృతదేహలను పోస్ట్ మార్టం కు పంపించి ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు..