ఉక్రెయిన్‌పై (Ukraine) రష్యా జరిగించిన యుద్ధం ఇంకా ప్రపంచం కళ్ల ముందు మెదిలాడుతూనే ఉంది. కొన్ని నెలల పాటు ఉక్రెయిన్‌పై జరిగించిన మారణహోమానికి శిథిలాలు సజీవ సాక్ష్యాలుగా మిగిలాయి. ఇప్పటికీ అక్కడ ఏం జరుగుతుందోనన్న భయాందోళన ఉక్రెయిన్లను వెంటాడుతూనే ఉంటుంది. అయితే తాజాగా అమెరికాకు (America) చెందిన ఓ మీడియా సంస్థతో రష్యా అధ్యక్షుడు పుతిన్ (Vladimir Putin) మాట్లాడుతూ యుద్ధానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉక్రెయిన్ విషయంలో అమెరికా జోక్యం చేసుకోకపోతే యుద్ధానికి ఎప్పుడో శాంతియుత పరిష్కారం లభించేదని పుతిన్ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో అమెరికాను జోక్యం చేసుకోవద్దని కోరామని తెలిపారు. ఆయుధ సరఫరాను నిలిపివేయాలని సూచించామని చెప్పారు. కానీ అలా జరగలేదని చెప్పుకొచ్చారు. తమ దేశం నాటోలో చేరాలనుకున్నా అది సాధ్యం కాలేదని పుతిన్ వివరించారు.
ఉక్రెయిన్‌లో యుద్ధానికి తిరుగుబాటే కారణమని చెప్పుకొచ్చారు. 2008లో నాటో కూటమి ఉక్రెయిన్‌కు ద్వారాలు తెరిచిందన్నారు. డాన్‌బాస్‌లో ఉక్రెయిన్ పాలకులు యుద్ధం మొదలుపెట్టారని… ప్రజలపై శతఘ్ని గుండ్లు ప్రయోగించారని గుర్తుచేశారు. ఈ చర్యలతోనే సైనిక చర్య మొదలైందని పుతిన్ పేర్కొన్నారు.