Site icon NTV Telugu

iPhone Ban in Russia: రష్యాలో ఐఫోన్స్ బ్యాన్.. ఎందుకో తెలుసా..?

Iphones

Iphones

రష్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో తయారైన యాపిల్ ఐఫోన్లను ప్రభుత్వ అధికారులు ఉపయోగించకుండా నిషేధించినట్లు వెల్లడించింది. ఐఫోన్‌లు, ఐప్యాడ్‌ల వంటి ఇతర యాపిల్ ఉత్పత్తులను వినియోగించడం మానేయాలని రష్యా యొక్క ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ వేలాది మంది అధికారులకు చెప్పిన్నట్లు తెలుస్తోంది. ఇవాళ్టి (జూలై 17 ) నుంచి రష్యా యొక్క వాణిజ్య మంత్రిత్వ శాఖలోని ఉద్యోగులు ఇకపై ఆఫీసుల్లో ఐఫోన్‌లను ఉపయోగించడానికి అనుమతించబడరని నివేదికలో వెల్లడించారు.

Read Also: 2,600 Flights Cancelled: పిడుగుల ఎఫెక్ట్‌.. 2600కి పైగా విమానాలు రద్దు, 8 వేల విమానాలు ఆలస్యం..

క్రెమ్లిన్, ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ గూఢచారి ఏజెన్సీలో ఆందోళన పెరుగుతుంది. క్రెమ్లిన్‌లోని వివిధ మంత్రిత్వ శాఖలు, సంస్థలలో యాపిల్ ఉత్పత్తులను వెంటనే నిషేదించాలని తెలిపారు. అమెరికా గూఢచర్య సంస్థల గూఢచర్య ప్రయత్నాల పెరుగుదలతో రష్యా సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. యాపిల్ ఉత్పత్తులను నిషేధించినట్లు ప్రభుత్వ ఏజెన్సీకి సంబంధించిన ఓ అధికారి తెలిపారు. మంత్రిత్వ శాఖలలోని భద్రతా అధికారులు, ఎఫ్ఎస్బీ ఉద్యోగులు, ఐఫోన్స్ వాడటం సురక్షితం కాదని వాటికి ప్రత్యామ్నాయ మొబైల్ ఫోన్స్ వినియోగించాలని ప్రకటించారు.

Read Also: Varshini : ఫారెన్ వీధుల్లో పొట్టి షాట్‌లో పరేషాన్ చేస్తున్న యాంకర్ వర్షిణి..

గతంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2025 నాటికి దేశీయంగా అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్‌కు మారాలని తెలిపారు. దేశానికి సంబంధించిన “క్లిష్టమైన ఇన్ఫర్మేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్”లో ఉన్న ఏజెన్సీలు, సంస్థలను ఆరోగ్య సంరక్షణ, విజ్ఞాన శాస్త్రం, ఆర్థిక రంగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఐఫోన్స్ నిషేదం అనేది కొన్ని రోజుల పాటు అమలులో ఉంటుందని పేర్కొన్నారు. అయితే, అమెరికా తమ సాంకేతికతను వైర్‌ట్యాపింగ్ కోసం ఉపయోగిస్తున్నట్లు రష్యా భద్రతా- గూఢచారి చీఫ్ ఆండ్రీ సోల్డాటోవ్ పేర్కొన్నాడు. ఇలాంటి సమయంలో ఉద్యోగులు ఐఫోన్స్ ఉపయోగించడం వల్ల తమ దేశ రహస్యాలు బయటకు వెళ్లే అవకాశం ఉండటంతో దాన్ని కొన్ని రోజుల పాటు నిషేదిస్తున్నట్లు అతడు వెల్లడించారు. దీనిపై చాలా కాలంగా ఎఫ్ఎస్బీ ఆందోళన చెందుతోంది.

Exit mobile version