రష్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో తయారైన యాపిల్ ఐఫోన్లను ప్రభుత్వ అధికారులు ఉపయోగించకుండా నిషేధించినట్లు వెల్లడించింది. ఐఫోన్‌లు, ఐప్యాడ్‌ల వంటి ఇతర యాపిల్ ఉత్పత్తులను వినియోగించడం మానేయాలని రష్యా యొక్క ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ వేలాది మంది అధికారులకు చెప్పిన్నట్లు తెలుస్తోంది.